Go Green Initiative by ACSR Government Medical College: 7 వేలకు పైగా మెుక్కలు నాటి.. పచ్చదనం కోసం మెడికల్ విద్యార్థుల కృషి

author img

By

Published : Aug 15, 2023, 4:33 PM IST

Go Green Initiative by ACSR Government Medical College

Go Green Initiative by ACSR Government Medical College: పచ్చదనాన్ని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక మెుక్కలను నాటాలని.. అందులో యువత ముందుండాలని పిలుపునిస్తున్నారు.. నెల్లూరు ఏసీఎస్​ఆర్‌ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు. గో గ్రీన్‌ పేరుతో నాలుగేళ్లుగా మెడికల్ కళాశాల, అనుబంధ ఆస్పత్రి ఆవరణలో పచ్చదనంతో నింపేశారు. సీనియర్స్ నాటిన మెుక్కలను సంరక్షిస్తూ.. కొత్త మెుక్కలను నాటుతున్నారు వైద్యవిద్యార్థులు.

Go Green Initiative by ACSR Government Medical College: 7 వేలకు పైగా మెుక్కలు నాటి.. పచ్చదనం కోసం మెడికల్ విద్యార్థుల కృషి

Go Green Initiative by ACSR Government Medical College: నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రాంగణం మొత్తం 75 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. మెడికల్ కళాశాల విద్యార్ధుల కృషితో ఆ ప్రాంగణం మెుత్తం వేల మెుక్కలతో పచ్చదనాన్ని సంతరించుకుంది. నాలుగేళ్లుగా వైద్యవిద్యార్ధులు గో గ్రీన్ అనే పేరుతో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ప్రతి ఆదివారం.. సెలవురోజుల్లో మొక్కలు నాటుతున్నారు. 300 మంది వైద్య విద్యార్ధులు సుమారు 7 వేలకు పైగా మెుక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టారు.

ఈ మెడికల్ కళాశాలలో ఏపీ, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన విద్యార్ధులు ఉన్నారు. విద్యార్థులు వారి సొంత నగదును గ్రో గ్రీన్ కార్యక్రమానికి ఖర్చుచేస్తున్నామని చెబుతున్నారు. కళాశాల, ఆస్పత్రి ఆవరణలో పచ్చదనం కోసం మెుక్కలు పెంచుతున్నామని విద్యార్థులు తెలిపారు. మెుక్కల సంరక్షణకు రోజుకు రెండు గంటల సమయాన్ని కెటాయిస్తున్నామన్నారు.

Forest Beauty: అడవుల ఖిల్లా.. పచ్చదనం పరుచుకుందిలా..!

విద్యార్ధి దశలో మెుక్కలు నాటడం అలవాటు చేసుకుంటే వృత్తిలో ఆసుపత్రుల్లో మొక్కలు పెంచడం అలవాటుగా మారుతుందని వైద్యవిద్యార్ధులు అన్నారు. ఆసుపత్రికి వెళ్లే బాధితులకు ఆహ్లదకరమైన వాతావరణం ఎంతో అవసరమని అంటున్నారు. విద్యార్ధి దశలోనే కాక వైద్య వృత్తిలో కొనసాగుతున్న సమయంలోనూ అక్కడ ఆసుపత్రుల్లో మొక్కలు పెంచడానికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు.

ఆసుపత్రికి వచ్చే బాధితులకూ ఇలాంటి పచ్చని వాతావరణం చాలా అవసరమని.. వారి మనస్సుకు ఆహ్లాదం కూడా అందిస్తుందంటున్నారు. మెుక్కలు నాటడానకి ప్రభుత్వం వారికి సహకరిస్తే ఇంకా చెట్లు పెంచడానికి ప్రోత్సాహకరం గా ఉంటుందని వారు చెబుతున్నారు. పచ్చదనం పెంచుతూ ఈ వైద్య కళాశాల యువత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకు అందరు మెుక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థు పిలుపునిస్తున్నారు.

terrace gardening: ఆమెకు మెుక్కలంటే ప్రాణం.. ఇంటి ఆవరణమంతా పచ్చదనం!

"ప్రతి ఒక్కరికీ పచ్చదనం చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము దీని పేరు గో గ్రీన్ ఏసీఎస్​ఆర్ అనుకున్నాం. మా ఏసీఎస్​ఆర్​ని మేము పచ్చదనంగా ఉండాలని కోరుకుంటున్నాం". - విద్యార్థి

"మా సీనియర్ల క్యాంపస్​లో చాలా మొక్కలు నాటారు. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మా సీనియర్ల నుంచి స్ఫూర్తి పొంది, వారి ప్రోత్సాహంతో మేము ప్రస్తుతం మొక్కలు నాటుతున్నాం. అదే విధంగా మేము మా జూనియర్లను కూడా పోత్సహిస్తాం". - విద్యార్థిని

"ఇక్కడకి వచ్చినప్పుడు మొక్కలు ఏం ఉండేవి కావు. మా సీనియర్లు బకెట్లతో నీళ్లు పోశారు. అప్పటికి వాళ్లకి పైప్​లతో పోయడానికి డబ్బులు లేక చాలా కష్టపడ్డారు. వాళ్లు మమ్మల్ని ప్రోత్సహించారు. అదే విధంగా మేము మా జూనియర్లకి చెప్తున్నాం. మాకు వీలైనంత వరకూ మొక్కల్ని నాటడమే కాకుండా దానిని బాధ్యతగా పరిరక్షించే విధంగా తీర్చిదిద్దుతున్నాం". - విద్యార్థి

టీచరమ్మ చేతిలో పులకరించిన పచ్చదనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.