ETV Bharat / state

చిట్టీల పేరుతో మోసం... రూ.15 కోట్లతో ఉడాయింపు

author img

By

Published : Sep 11, 2021, 4:21 AM IST

nellore district chitties fraud
nellore district chitties fraud

కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువులకోసమని మరొకరు.. ఇలా ప్రతి నెల చిట్టీల రూపంలో ప్రతిఒక్కరూ ఆదా చేసుకునేలా ప్రణాళిక వేసుకుంటారు. ఈ వ్యాపారాన్ని ఆసరాగా చేసుకుని రూ. కోట్లల్లో ఎగనామం పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

నెల్లూరు జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ పార్కు సమీపంలోని మల్లికార్జున అనే వ్యక్తి కార్తీక్ కన్స్‌ట్రక్షన్ పేరుతో చిట్టీలను నిర్వహించేవాడు. ఏళ్ల తరబడి చెల్లింపులు సక్రమంగా చేస్తుండటంతో... చిట్టీలు వేసేవారి సంఖ్య పెరిగింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు అతని వద్ద చిట్టీలు వేసేవారు. ఈ క్రమంలో ప్రజల వద్ద నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసిన మల్లికార్డున... అనంతరం చెల్లింపులు చేయకుండా ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను అశ్రయించారు. కాయకష్టం చేసి రూపాయి రూపాయి దాచిపెట్టి చిట్టీలు కడితే తమను నిండా ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమ డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిట్టీల పేరుతో మోసం... రూ.15కోట్లతో ఉడాయింపు
ఇదీ చదవండి

మద్యం తాగొచ్చి భర్త వేధింపులు...పోలీసులకు భార్య ఫిర్యాదు..ఆ తర్వాత !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.