నెల్లూరులో యూరియా కృత్రిమ కొరత.. ఇబ్బందుల్లో రైతులు

author img

By

Published : Jan 14, 2023, 1:52 PM IST

UREA
UREA ()

Urea At Higher Prices: రైతుల పండుగ సంక్రాంతి వేళ.. సాగు కోసం వాడే యూరియా కోసం అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద నిల్వలు లేవంటూ నెల్లూరు జిల్లా రైతులు వాపోతున్నారు.అధికారులు మాత్రం యూరియా కొరత లేదంటున్నారు.

నెల్లూరులో యూరియా కృత్రిమ కొరత.. ఇబ్బందుల్లో రైతులు

Urea At Higher Prices: వ్యవసాయ సీజన్​లో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ళుగా ప్రతి రబీ సీజన్​లో ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు బ్లాక్​లో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఎరువులు బయట మార్కెట్​కు తరలిపోవడంతో వ్యాపారులు కృత్తిమ కొరతను సృష్టిస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు అల్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్​లో ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంత మంది రైతులకు యూరియా సప్లై చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు.

యూరియా పక్కదారి: ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లా అధికారుల వైఫల్యాల కారణంగా అధికార పార్టీనేతలు యూరియాను పక్కదారి పట్టించడంతో బ్లాక్ మార్కెట్​లో అమ్ముతున్నారు. సాధారణంగా యూరియా ఆర్బీకేలు, పీఏసీఎస్​ల్లో 266 రూపాయలకు విక్రయిస్తారు. వ్యాపారులు మాత్రం 320నుంచి 360రూపాయలకు అమ్ముతున్నారు. బస్తాకు 60 నుంచి 90రూపాయలు లాభం వస్తుండటంతో వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వం నుంచి వచ్చిన యూరియాను దారిమళ్లీస్తున్నారు. ఆర్బీకేలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద 20శాతం మంది రైతులకు మాత్రమే అందుతుంది. మిగిలిన రైతులు పోరాటం చేయలేక వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాకు 65వేల టన్నుల యూరియా సరఫరా అయ్యింది. సక్రమంగా పంపిణీ చేస్తే రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు.

యూరియా చల్లాల్సింది పిండి చల్లుతున్నాం. ఎవ్వరికి వస్తున్నాయో ఎవ్వరికి పోతున్నాయో, పెద్ద పెద్ద వాళ్లకు ఇస్తున్నారు 1,2 ఎకరాలు ఉన్న వాళ్లకు ఇవ్వటం లేదు. కూర్చోని కూర్చోని గమ్మున వస్తున్నాం. సేద్యానికి డబ్బులు అయిపోతున్నాయి. -రైతు

జిల్లాలో ఎక్కడ కూడ యూరియా కొరత లేదు. జేడీ గారితో కూడా మాట్లాడాం. అట్లే మంత్రిగారు మన జిల్లాయే కాబట్టి ఈ యూరియా ఎక్కడ కొరత లేకుండాచూసుకుంటా ఉండాడు. రెండు, మూడు సార్లు ఏమైదంటే యూరియా చల్లిన పరిస్థితిలో మళ్లా వర్షాలు వచ్చి మళ్లా దెబ్బతినిపోవడం మళ్లా చల్లటం ఫస్ట్ స్పాన్ లో కొద్దిగా ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. -వీరి చలపతి రావు, ప్రాథమిక సహకార సంఘం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్

అధిక ధరలకు విక్రయం: అధికారులు కొరత లేదని అంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద నిల్వలు లేవంటున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఎరువుల డీలర్లుకు సరఫరా చేసిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సీజన్ ముగుస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.