జగనన్నా రెండో ఉగాది పోయింది.. ఇళ్లు ఎక్కడ..?

author img

By

Published : Mar 26, 2023, 6:07 PM IST

Jagananna Colony

Tidco Houses : పేదలందరికీ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం గొప్పలకు పోయింది. జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు ఉగాది పండగకు అందిస్తామన్న ఇళ్లు అందివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాయిదా ప్రకారం.. రెండో ఉగాది వరకు కూడా ఇళ్లను అందిచలేదని అంటున్నారు. నిర్మాణాలు పూర్తైన టిడ్కో ఇళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని లబ్దిదారులు అంటున్నారు.

Jagananna Colony : పేదలందరికీ ఇళ్లు అని ప్రభుత్వం ప్రకటించినట్లుగా.. నెల్లూరు జిల్లాలో జగనన్న లేఅవుట్లలో నిర్మిస్తున్న అనేక ఇళ్లు ఇంకా పునాదుల స్థాయిని దాటలేదు. అదికాకుండా ప్రభుత్వ లే అవుట్లలో కేటాయించిన స్థలాలలో.. ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులు ఆసక్తిగా లేరు. నిర్మాణ ఖర్చులు పెరగటంతో వారు ఇళ్లను నిర్మించుకోవటానికి ముందుకు రావటం లేదు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న నగదు చాలకపోవటంతో.. ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న నగదుతో ఇంటి నిర్మాణం పూర్తికాదని లబ్దిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. ఇళ్లకు అద్దెలు చెల్లించటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కొన్ని చోట్ల అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి.. బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు.

ముందుకు సాగని పనులు : నెల్లూరు జిల్లాలో సుమారు 75 వేల 94 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. 16 వేల 898 ఇళ్లను ఉగాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో.. ఆరు వేల 718 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. 9 వేల 827 ఇళ్ల నిర్మాణాలను ఇంకా ప్రారంభించనేలేదు. గృహప్రవేశాల కోసం ఏప్రిల్ 15వ తేదీని ప్రకటించారు. వాస్తవంగా చూస్తే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రకటించిన తేదీకి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా కనిపించటం లేదు. ప్రతి శనివారం రోజు అధికారులు హౌసింగ్​డే నిర్వహిస్తున్నా పనులు వేగంగా ముందుకు సాగడంలేదు.

జగనన్న లేఅవుట్లలో నాణ్యత లోపాలు : జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత సరిగా లేదని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. నాసిరకం సిమెంట్, ఇటుకలను​ వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం వినియోగించే ఉక్కు.. వినియోగించాల్సిన దానికన్నా తక్కువ మందంతో ఉండే దానిని వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానివల్ల ఇళ్లు ఎన్ని రోజులు నిలిచి ఉంటాయో తెలియదని వాపోతున్నారు.

పేదలకు అందని టిడ్కో ఇళ్లు : పేదల సొంతింటి కలను నిజం చేయటానికి అందించనున్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తైన.. చాలా చోట్ల లబ్దిదారులకు అందించలెేదు. ఉగాదికి సాముహిక గృహప్రవేశాలని ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన వాయిదా ప్రకారం.. ఒకటోది కాకుండా, రెండో ఉగాది పోయిన కూడా పేదలకు ఇళ్లను అందివ్వలేదు. తాజాగా మళ్లీ ఏప్రిల్​ 15వ తేదీన గృహప్రవేశాలని ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికి 1000కిపైగా ఇళ్లను నిర్మించారు. ఇవి గ్రామాలకు దూరంగా ఉండటం, విద్యుత్​ సమస్య, రోడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవటం, మురుగు కాలువలు లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య కూడా ఉంది. కనీస వసతులు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని లబ్దిదారులు ఇళ్లలో చేరటానికి ముందుకు రావటం లేదు. గృహప్రవేశాలు చేయాలంటే మౌలిక వసతులు, కనీస ఏర్పాట్లు చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.