ETV Bharat / state

v-epic-theater: ఆసియాలో అతిపెద్దదయిన స్క్రీన్ థియేటర్ మూసివేత

author img

By

Published : Dec 26, 2021, 7:34 AM IST

v-epic-theater: ఆసియాలో అతి పెద్ద స్క్రీన్ కల్గిన నెల్లూరులోని వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆ థియేటర్ యాజమాన్యం తెలిపింది. జీవో నెం 35కి అనుగుణంగా థియేటర్ నడపలేనందువల్లే మూసి వేసినట్లు స్పష్టం చేశారు.

closure-of-v-epic-theater-in-nellore
ఆసియాలో అతిపెద్దదయిన స్క్రీన్ థియేటర్ మూసివేత

v-epic-theater: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు ప్రకటిస్తున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు నగరం.. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, జీవో నెం:35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని శనివారం ఉదయం యాజమాన్యం తెలిపింది. దీంతో థియేటర్‌కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.

‘వి-ఎపిక్‌ ప్రత్యేకతలివే’

  • ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ కలిగిన టాప్‌ థియేటర్‌లలో ‘వి-ఎపిక్‌’ ఒకటి.
  • తెలుగులో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ సంస్థకు చెందిన ‘వి సెల్యులాయిడ్’ ‘వి-ఎపిక్‌’ మల్టీప్లెక్స్‌ను నిర్మించింది.
  • సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన ‘వి-ఎపిక్‌’ ఉంది.
  • సుమారు రూ.40 కోట్ల వ్యయంతో ఈ భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.
  • దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్‌తో ఈ మల్టీప్లెక్స్‌ తీర్చిదిద్దారు.
  • కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో కూడిన హైఎండ్‌ లేజర్‌ ప్రొజెక్షన్‌ ఈ థియేటర్‌లో ఉంది.
  • ఈ థియేటర్‌కు 656 సీట్ల సామర్థ్యం ఉంది. 3డీ సౌండ్‌ సిస్టమ్‌ దీని ప్రత్యేకత.
  • ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమాను తొలిసారి ఈ థియేటర్‌లో ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

Road Accident In Nellore District : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.