ETV Bharat / state

'గ్రామ, పట్టణ తీర్పునకు తేడా ఉంటుంది'

author img

By

Published : Mar 6, 2021, 6:10 PM IST

bjp press meet in nellore district
'గ్రామ తీర్పునకు పట్టణ తీర్పునకు తేడా ఉంటుంది'

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల తీర్పునకు, పట్టణ ప్రజల తీర్పునకు తేడా ఉంటుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రాష్ట్ర బంద్ విఫలమైందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు తప్పదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల తీర్పునకు, పట్టణ ప్రజల తీర్పునకు తేడా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపాకు షాక్ ఇవ్వబోతున్నామని జోస్యం చెప్పారు. ఏకగ్రీవాల్లో తాము విజయం సాధించామని మంత్రి బొత్స సత్యనారాయణ, దౌర్జన్యాలు చేసి ఎవరైనా ఏకగ్రీవాలు చేసుకుంటారా అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లడారు. దౌర్జన్యాలు, ప్రలోభాలతోనే ఉంపసంహరణలు జరిగాయనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైకాపా, మున్సిపల్ ఎన్నికల్లో 30 శాతం సీట్లు కోల్పోయినా ఓడిపోయినట్లేనని అన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రాష్ట్ర బంద్ విఫలమైందని ఆంజనేయ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. విశాఖ ఉక్కుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఫోక్సో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు.

ఇదీ చదవండి

పురపాలిక బరిలో.. అక్కాచెల్లెళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.