ETV Bharat / state

మేకిన్ ఇండియా.. వినూత్న రోబోలను తయారు చేస్తున్న విద్యార్థులు

author img

By

Published : Apr 5, 2023, 5:14 PM IST

Atal Tinkering Labs: మేకిన్ ఇండియాలో భాగంగా సాంకేతికతను విద్యార్థుల చెంతకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కోసం ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉండే ల్యాబ్‌లను.. అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల పేరుతో పాఠశాల స్థాయిలోనే ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలోని విద్యార్థులు ఈ ల్యాబ్‌లను ఉపయోగించుకొని వినూత్న పరికరాలు తయారు చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

మేకిన్ ఇండియా..వినూత్న రోబోలను తయారు చేస్తున్న విద్యార్థులు

Atal Tinkering Labs : మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్ధి దశ నుంచి సృజనాత్మకతను పెంచడం కోసం సాంకేతికతను విద్యార్ధుల చెంతకు తీసుకు వచ్చింది. ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో ఉండే ల్యాబ్​ను పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేశారు. వాటినే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని నామకరణ చేశారు. విద్యార్థికి వచ్చిన ఎటువంటి ఆలోచన అయినా వెంటనే ఆచరణలో పెట్టేందుకు పాఠశాల స్థాయిలో ల్యాబ్​లను ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా పరికరాలను తయారు చేస్తున్న నెల్లూరు విదార్ధుల మేథస్సును ఒక్కసారి చూద్దాం..

నైపుణ్యాలకు పదును పెట్టేందు కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను మంజూరు చేసింది. నెల్లూరు జిల్లాలో 2019 నుంచి 36 ఉన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ల్యాబ్​కు మొదటి సంవత్సరం 10 లక్షలు, రెండో సంవత్సరం మరో 10 లక్షలు మంజూరు చేశారు. చక్కటి తరగతి గదిలో ఏర్పాటు చేశారు.

నెల్లూరులోని 36 పాఠశాలల్లో విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా పరికరాలు తయారు చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వారికి వచ్చిన ఆలోచనను ఈ ల్యాబ్ లో కార్యరూపం దాలుస్తోంది. విద్యార్ధికి ఖర్చు లేకుండా ఈ ల్యాబ్​లో రోబోలను, స్వీపింగ్ మిషన్లు, రైతులు పొలాల్లో వినియోగించే యంత్ర సామగ్రి తయారు చేస్తున్నారు. మోడల్​గా తయారు చేస్తున్న యంత్రాలను చూస్తే విద్యార్ధుల్లో ఎంత మేథస్సు దాగి ఉందో అర్థం అవుతుంది.

అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణను సైన్స్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ల్యాబ్ లో అనేక విడిభాగాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు వాటిని కలిపి యంత్ర పరికరాలను తయారు చేస్తున్నారు. ఎంతో ఉపయోగంగా ఉందని విద్యార్ధులు అంటున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయు బోధించే దానికన్నా ప్రయోగశాలలో తయారు చేయడం ఎంతో గొప్పగా ఉందని వారు అంటున్నారు.

జాతీయ, రాష్ట్ర స్ధాయిలో జరిగిన సైన్స్ ఫైయిర్ పోటీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన అనేక మోడల్స్ పోటీల్లో పాల్గొన్నాయి. రెండు వేల ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. అమృత మహోత్సవంలో 4900 ప్రాజెక్టులను ప్రదర్శించారు. జిల్లాకు అనేక అవార్డులు వచ్చాయి. ప్రాథమిక స్థాయి దశలో విద్యార్ధికి ఎంతో ల్యాబ్​ల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్ ను 20లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం ప్రాథమిక స్థాయిలో ఒక ప్రయోగంగా చెప్పుకోవాలి. తమకొచ్చే వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి.... అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అంటున్నారు.

" వాయిస్ కంట్రోల్ రోబోట్.. మనం వాయిస్ కమాండ్ ఇవ్వడం వల్ల ముందుకు, వెనక్కి మూవ్ అవుతుంది. ఎవరైనా వికలాంగులు ఉన్నప్పుడు వాళ్లు లేచి నడవడానికి కష్టం అవుతుంది. వాళ్ల ఫోన్​లో యాప్ డౌన్​లోడ్ చేసుకోని కమాండ్ ఇవ్వడం వల్ల మనకు కావలసింది తీసుకువస్తుంది. " - విద్యార్థిని

" మేము ఒక ప్రాజెక్టు చేశాము. ఇది స్మార్ట్ బ్లేస్టీ. ఇది కళ్లు లేని వారికి మంచిగా ఉపయోగపడుతంది. వాళ్లు గోడకు గుద్దుకోకుండా ఉపయోగపడుతుంది. " - విద్యార్థి

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.