ETV Bharat / state

మాచర్ల ఘటనలో టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు, వైసీపీ నేతలపై నామ మాత్రం సెక్షన్లు

author img

By

Published : Dec 17, 2022, 9:31 PM IST

cases on the Macherla incident: మాచర్ల ఘటనపై తెదేపా, వైకాపా నేతలపై 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రహ్మారెడ్డి సహా 9 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురక కిశోర్‌పై కేసు నమోదైంది. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, ఇళ్లలో విధ్వంసాలపై తురక కిశోర్ సహా 10 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

case on the Macherla incident
మాచర్ల

Police registered a case on the Macherla incident: పల్నాడులో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు అయ్యాయి. బ్రహారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.. బ్రహ్మారెడ్డి.. ఇతరులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏ-1గా బ్రహ్మారెడ్డి పేరును పేర్కొన్నారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమపై బ్రహ్మారెడ్డి, బాబూ ఖాన్లు రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని చల్లా మోహన్ ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని దుండగులు తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతో తామే రాళ్లేశామనే ఉద్దేశ్యంతో బ్రహ్మారెడ్డి తమపై దాడి చేశారని ఫిర్యాదులో స్పష్టం చేసారు.

మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిషోర్ మీద కేసు నమోదు అయ్యింది. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్టమెంటులో జొరబడి చేసిన విధ్వంసాలపై కేసు నమోదు అయ్యింది. తురక కిషోర్ సహా 10 మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు. వీరి పై సెక్షన్లు 323, 448, 143, 147 కింద కేసు నమోదు చేసారు. ఏ-1గా తురక కిషోర్, ఏ-2గా చల్లా మోహన్ ని పేర్కొన్నారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు. తెలుగుదేశం నేతల మీద హత్యాయత్నం క్రింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసు కేసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైకాపా నేతల మీద నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.