ETV Bharat / state

లెదర్ పార్క్​పై నిర్లక్ష్యం.. 10వేల మందికి ఉపాధి అవకాశాలపై ప్రభావం...

author img

By

Published : Feb 18, 2023, 5:47 PM IST

Leather Park in Palnadu district: పల్నాడు జిల్లాలోని చర్మకార వృత్తిదారులు దుకాణాల మందు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. తమవృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం లీడ్ క్యాప్ ద్వారా చర్మకార వృత్తిదారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవరడం లేదు. యువతకు మారుతున్న కాలానికి అనుగుణంగా లెదర్ సాంకేతికత ద్వారా శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం ఆవైపు దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Etv Bharat
Etv Bharat

Leather Industries Development Corporation: పల్నాడు ప్రాంతంలో నక్సలిజం ప్రభావం బాగా ఉన్న రోజులవి. గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువత విప్లవ భావాజాలం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని దళితులు విప్లవోద్యం వైపు వెళ్లకుండా నిలువరించడంతో పాటు వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2003వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దుర్గి మండలం అడిగొప్పుల, మాచర్ల పట్టణంలోని పురపాలక క్వారీ వద్ద మలుపు శిక్షణా కేంద్రాలు (లెదర్ పార్క్)లను నిర్మించింది. యువతకు చెప్పులు, బూట్లు, లెదర్​కు సంబంధించిన వస్తువులు తయారు చేయడంలో ఇక్కడ శిక్షణ ఇప్పించారు. కొందరు యువత మద్రాస్​లో సైతం శిక్షణ ఇప్పించి ఇక్కడ మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇప్పించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు సైతం అందించారు.

ఇక తమకు ఇబ్బందులు ఉండవు అని భావిస్తున్న తరుణంలో ఇక్కడ లెదర్ పార్క్ లను అర్ధాంతరంగా మూసివేశారు. దాదాపు పల్నాడులోని 10వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే ఈ లెదర్ పార్క్​లు మూత పడటంతో చర్మకార వృత్తి దారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారాయి. అడిగొప్పుల లెదర్ పార్క్​లో రూ. లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన లెదర్ పరికరాలు, మిషనరీ తుప్పుపట్టిపోతున్నాయి. ఉపాధిశిక్షణ లేకపోవడంతో బూజుపట్టాయి.

దీనికితోడు దాదాపు 30ఎకరాలకు పైగా ఉన్న లిడ్ క్యాప్ భూములు ప్రస్తుతం కేవలం 17ఎకరాలకు చేరింది. మిగిలిని భూమి వివిధ కారణాలతో కుచించుకోపోతుందని.. లెదపార్క్ ఉన్న ప్రాంతం అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం లేకపోలేదని చర్మకార వృత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగొప్పుల లెదర్‌ పార్క్‌లోనూ లక్షల వ్యయంతో కొనుగోలుచేసిన పరికరాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని వెల్లడించారు. దాదాపు 30ఎకరాలకు పైగా ఉన్న లెదర్‌ పార్క్‌ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. తమకు ఉపాధి కల్పించాలని చర్మకార వృత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగొప్పుల, మాచర్లలోని లెదర్ పార్క్‌లను పున:ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తామని అధికారుల పేర్కొన్నారు.

'శిక్షణా కేంద్రాలు ఉన్న ప్రాంతం ముళ్లచెట్లతో నిండిపోయింది. అడిగొప్పుల, మాచర్లలోని లెదర్ పార్క్ లను పున:ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తాం. శిక్షణా కేంద్రాలను పరిశీలించి ఇక్కడ పరిస్థితి గురించి తెలుసుకున్నాను. ఇక్కడ 30ఎకరాల లిడ్క్యాప్ భూములు 17ఎకరాలకు చేరింది. లీడ్క్యాప్ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి వచ్చే బడ్జెట్లో లిడ్ క్యాప్​కు ప్రత్యేక నిధులు కేటాయించేలా చూస్తాం. పల్నాడు ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు మావంతు కృషి చేస్తాం.'-కాకుమాను రాజశేఖర్, లిడ్ క్యాప్ ఛైర్మన్

మాచర్లలోని లెదర్ పార్క్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.