ETV Bharat / state

Double Votes in Macharla: మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండేసి ఓట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 6:59 PM IST

Double_votes_in_Macharla
Double_votes_in_Macharla

Double votes in Macharla : ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో కాదు.. వందలు.. వేలు. మాచర్ల నియోజకవర్గంలో నకిలీ ఓట్లు మాత్రమే కాదు.. దాదాపు 5 వేల మందికి రెండేసి ఓట్లున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి కుటుంబ సభ్యులకు కూడా రెండేసి ఓట్లు ఉండడం.. ఓటరు జాబితా రూపకల్పనపై సవాలక్ష సందేహాలకు తావిస్తోంది.

Double votes in Macharla : మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండు ఓట్లు..

Double votes in Macharla Constituency for More Than 5 Thousand Voters : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ(Macherla Constituency) ఓటరు జాబితాలో 5 వేలకుపైగా ఓటర్లకు రెండేసి ఓట్లు ఉన్నట్లు స్పష్టమైంది. ఎన్నికల సంఘం తాజాగా రూపొందించిన జాబితాను బూత్‌ల వారీగా పరిశీలించగా అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. డబ్లింగ్‌ తొలగించాల్సి ఉండగా, బీఎల్‌వోలపై రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసినట్లు తెలుస్తోంది. వేల మంది వైసీపీ సానుభూతిపరులకు రెండుచోట్లా ఓటు హక్కు ఉండటం గమనార్హం. వీరంతా సాంకేతికంగా ఎక్కడా దొరకకుండా పేరు, వయసు, ఫొటోల్లో మార్పులు చేసి వేర్వేరు బూత్‌ల పరిధిలో ఓటర్లుగా చేరారు. ఈ అక్రమంలో విశ్రాంత తహసీల్దారు ఒకరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.

Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!

Two Votes to MLA Pinnelli Ramakrishna Reddy Family: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( MLA Pinnelli Ramakrishna Reddy ) సోదరుడు వెంకట్రామిరెడ్డి, అతని కుటుంబసభ్యులకు వారి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకుంటతో పాటు మాచర్ల పట్టణంలోనూ ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యే భార్య రమకు కండ్లకుంట 114వ బూత్‌లో సీరియల్‌ నంబర్‌ 69లో SKK0044859తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్‌ వరుస సంఖ్య 1176లో SKK0098764తో మరో ఓటు ఉంది. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డికి కండ్లకుంటలో 114వ బూత్‌లో వరుస సంఖ్య 75లో SKK1897669తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్‌లో వరుస సంఖ్య 1175లో KBB2864791తోనూ రెండో ఓటు ఉంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య సోదరులు, వారి కుటుంబసభ్యులకు దుర్గి మండలం కోలగట్ల, మాచర్ల పట్టణంలో ఓట్లున్నాయి.

PRATHIDWANI: ఓటరు జాబితాపై దిల్లీకి ఫిర్యాదులు.. ఇంటింటికి ఓటరు సర్వే

పిన్నెల్లి బావమరిది శ్రీనివాసరెడ్డి మద్దికరకు కోలగట్లలో 177వ బూత్‌లో వరుస సంఖ్య 651లో SKK0164673తో ఓటు ఉండగా, మాచర్లలోని 69వ బూత్‌లో వరుస సంఖ్య 617లో SKK9685743తో మరొకటి ఉంది. శ్రీనివాసరెడ్డి భార్య, గ్రామ సర్పంచి మద్దికర మహాలక్ష్మి... 177వ బూత్‌లో... వరుస సంఖ్య 653లో SKK0660076తో ఓటు కలిగి ఉన్నారు. మాచర్ల (Macherla) లోని 69వ బూత్‌లో... వరుస సంఖ్య 620లో... SKK0686956తో రెండో ఓటు నమోదైంది. జక్కా శివపార్వతికి కోలగట్ల 178వ బూత్‌ SKK2381176, దుర్గిలోని 168వ బూత్‌లో SKK0742387 రెండు ఓట్లు ఉన్నాయి.

YCP Removing TDP Votes: అనుకూలమైతేనే ఓటర్ల జాబితాలో పేరు.. ఇదే అధికార పార్టీ తీరు

మండలం ఒప్పిచర్ల వాసి ప్రేమయ్య మహంకాళికి 250వ బూత్‌లో వరుస సంఖ్య 25లో SKK1674555తో ఓటు హక్కు ఇచ్చారు. అదే గ్రామంలో 255వ బూత్‌లో వరుస సంఖ్య 337లో SKK1807387తో మరో ఓటు హక్కు కల్పించారు. ఇదే గ్రామానికి చెందిన చల్లా జానకి మహాలక్ష్మికి 252 బూత్‌లో SKK2520450, 253 బూత్‌లో SKK2523322 ఓట్లు ఉన్నాయి. రెంటచింతలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు మోర్తల వెంకటేశ్వరరెడ్డికి స్వగ్రామంలోని 227వ బూత్‌లో వరుస సంఖ్య 1048లో SKK0519454 నంబరు గల ఓటరు కార్డుతో, రెంటాలలోని 239వ బూత్‌లో వరుస సంఖ్య 520లో LHL2977387తో రెండు ఓట్లున్నాయి.

Purandeshwari Comments on Fake Votes: ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం కమిటీలు: పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.