ETV Bharat / state

ఏడు పదుల వయసులోనూ.. తగ్గేదేలే అంటున్న చంద్రబాబు

author img

By

Published : Oct 19, 2022, 6:00 PM IST

Chandrababu Tour at Palnadu: పల్నాడు పర్యటనలో చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు. యువకులతో పోటీకి తానేమీ తక్కువ కాదన్నట్లుగా.. సిమెంట్ కాలువను దూకారు. బాబు దూకుడును చూసిన పార్టీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేయడంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

చంద్రబాబు
Chandrababu Tour

Chnadrababu Tour: రాజకీయాల్లో చురుగ్గా ఉండటమే కాదు.. క్షేత్రస్థాయిలో సైతం నిరంతరం యువకులతో పోటీ పడుతుంటారు చంద్రబాబు. దానికి నిదర్శనమే చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకుంది. ఏడు పదులు దాటిన వయసులోనూ చంద్రబాబు నాయుడు తనలో ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. నాదెండ్ల మండలం తూబాడు వద్ద వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పొలాల పరిశీలనలో భాగంగా అక్కడ ఉన్న సిమెంట్ కాలువను దాటాల్సి వచ్చింది. పార్టీ కార్యకర్తలతో పాటు చంద్రబాబు కూడా కాలువను అవతలి వైపునకు సునాయాసంగా దూకారు. ఈ దృశ్యాన్ని చూసి కార్యకర్తలు కేకలు, విజిల్స్ వేస్తూ... సంతోషం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సిమెంట్ కాలువను సునాయాసంగా దూకారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.