ETV Bharat / state

ఆరోగ్యం బాగాలేదని కాలువలోకి దూకిన మహిళ.. ఆ తర్వాత

author img

By

Published : Dec 22, 2022, 8:22 PM IST

Updated : Dec 22, 2022, 9:50 PM IST

Woman Suicide Attempt: ఓ మహిళ ఆరోగ్యం బాాగాలేదని కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన.. విజయవాడ వన్ టౌన్ ఫ్లవర్ మార్కెట్ వద్ద జరిగింది. ఫైర్ సిబ్బంది, గవర్నర్ పేట పోలీసులు.. మహిళను కాపాడి గవర్నర్​పేట స్టేషన్​కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Woman wanted to commit suicide by jumping into canal
ఆరోగ్యం బాాగాలేదని కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

Woman Suicide Attempt: విజయవాడ వన్ టౌన్ ఫ్లవర్ మార్కెట్ వద్ద పాయకాపురానికి చెందిన మహిళ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఫైర్ సిబ్బంది, గవర్నర్​పేట పోలీసులు మహిళను కాపాడి ఆరా తీయగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని.. అందుకే కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు షకీలా తెలిపింది. గవర్నర్​పేట స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, ఫైర్ సిబ్బంది జె. నాగరాజు, ఎ. శివరామకృష్ణ, రాజ్ కుమార్, డి. రాంబాబు, లోకేష్, బాలకృష్ణమూర్తి కాలువలోకి దూకి మహిళను బయటకు తీసుకువచ్చారు. మహిళను గవర్నర్​పేట స్టేషన్​కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.