ETV Bharat / state

విజృంభిస్తున్న వైరల్​ జ్వరాలు.. అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు

author img

By

Published : Mar 1, 2023, 7:16 AM IST

VIRAL FEVERS INCREASED : శీతాకాలం ముగుస్తూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న సమయంలోనూ.. జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాలు కంగారు పెడుతున్నాయి. ఇవన్నీ అయిదారు రోజుల్లో తగ్గిపోవాల్సి ఉండగా.. 10 నుంచి 15 రోజుల వరకు వీడటం లేదు. బాధితులు చాలావరకు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నా ఇవి ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటంతో వారి సంఖ్య పెరుగుతోంది.

viral infections
viral infections

VIRAL FEVERS INCREASED : రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. 3 రోజుల్లో తగ్గే జలుబు, దగ్గు నెలల తరబడి వెంటాడుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో ఆసుపత్రులకు వైరల్‌ జ్వరాలు, దగ్గు కేసులే ఎక్కువగా వస్తున్నాయి. చికిత్స అందించే క్రమంలో వైద్యులు అనారోగ్యం పాలవుతున్నారు.

విజయవాడ GGHలో... ముగ్గురు పీజీ వైద్యులు ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. ‘ఇప్పటి వరకు ఆస్తమా లక్షణాలు లేని వారు కూడా ఉన్న వారి మాదిరిగానే బాధపడుతున్నారు. బాధితులను పొడి దగ్గు చాలారోజులపాటు వేధిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులకు జలుబు, దగ్గు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయని వైద్యులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, చలి ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వాళ్లు, మధుమేహం నియంత్రణలో లేనివాళ్లు బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

"ఈ వైరల్​ ఇన్​ఫెక్షన్స్​ జూన్​ సమయంలో లేదా చలికాలంలో ఎక్కువుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీజన్​తో సంబంధం లేకుండా వ్యాపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 60శాతం ఎక్కువుగా కేసులు పెరిగాయి. ఈ ఇన్​ఫెక్షన్స్​ ముందుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో మొదలవుతుంది. అలా వారం రోజులు గడిచినా జ్వరం తగ్గుతుంది కానీ జలుబు, దగ్గు మాత్రం తగ్గదు. కొద్దిమందికి నెలరోజులకు పైగానే ఈ సమస్య ఉంటుంది"-డా.పూజిత, జనరల్ ఫిజీషియన్

జలుబు, ఎడతెరపిలేని దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వైరల్‌ జ్వరానికి ప్రధాన లక్షణాలు. వైరస్‌ సోకిన రెండు రోజుల్లోపే బాధితులపై ప్రభావం కనిపిస్తోంది. కళ్లు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతువాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో..... బాధితులు ఇబ్బందిపడుతున్నారు. చిన్నారులకు నెలల తరబడి జలుబు, దగ్గు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ, మలేరియా ఈ సీజన్‌లో కొంతమేర తగ్గినా .. ఎడినో, బొంకా వైరస్‌లు ప్రభావం చూపిస్తున్నట్లు పిల్లల వైద్యులు డా.పి వి రామారావు తెలిపారు.

"పిల్లల్లో చూసుకుంటే గత సెప్టెంబర్​, అక్టోబర్​ నుంచి వైరస్​ ఇన్​ఫెక్షన్స్​ ఎక్కువవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో బ్రాంకిలైటిస్ వస్తుంది. కానీ ఇది మూడు నుంచి ఐదు రోజులలోపు తగ్గిపోతుంది"-డా. పి. వి రామారావు , చిన్న పిల్లల వైద్యులు

చలికాలంలో వచ్చే జలుబు సాధారణంగా వెంటనే తగ్గిపోతుంది. అయితే వృద్ధులు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కిడ్నీ జబ్బులున్న వారు, కొందరు చిన్నపిల్లలకు..న్యూమోనియాగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు బారినపడిన వారిలో ఎలర్జీలు ఉన్న వారుంటే.. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కరోనా సోకినవారు, పొగతాగేవారు, ఆస్తమా బాధితులు, ఇతర దీర్ఘకాలిక జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.