ETV Bharat / state

జగన్ మామ! ఇలా జరిగిందేంటీ..? ఉన్నతాధికారుల ప్రణాళిక లోపంతో కోట్లరూపాయలు వృధా !

author img

By

Published : Jan 13, 2023, 10:45 AM IST

Updated : Jan 13, 2023, 11:41 AM IST

Text Books: పాఠశాల విద్యలో సంస్కరణలంటూ.. కోట్ల రూపాయల్ని వృధా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు పాఠ్యపుస్తకాల ముద్రణ తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ప్రైవేటు పాఠశాలలు సైతం ప్రభుత్వం వద్దే కొనుగోలు చేయాలంటూ.. నిబంధన పెట్టిన అధికారులు, వాటిని సకాలంలో అందించలేకపోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అక్షరాల 35 లక్షల పాఠ్యపుస్తకాలు ఎవరికి కాకుండా పోయాయి. ముందు చూపు లేకుండా, హడావిడి చేయడం వల్లే.. కోట్ల రూపాయల విలువ గల పుస్తకాలు చిత్తుకాగితాలుగా మారిపాయాయనే అరోపణలు వెల్లువెత్తున్నాయి.

gtrgt
rgtr

Text Books: విద్యాశాఖ అధికారుల ప్రణాళిక లోపంతో రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా పాఠ్య పుస్తకాలు వృధాగా మారాయి. సిలబస్‌ మారిపోతున్నందున వచ్చే విద్యా సంవత్సరమూ వీటిని వినియోగించే పరిస్థితి లేదు. సంస్కరణల పేరుతో ఈ ఏడాది ప్రైవేటు విద్యాసంస్థలూ కూడా విద్యాశాఖ దగ్గరే పుస్తకాలు కొనాలనే నిబంధన తీసుకొచ్చారు. ఇందుకోసం బయట మార్కెట్‌లో అమ్మే పుస్తకాల ముద్రణకు అనుమతులు ఇవ్వలేదు అధికారులు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి ఇండెంట్‌ తీసుకున్నారు. కొన్నిచోట్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా, మండల విద్యాధికారులే ఇండెంట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జులై 5న పాఠశాలలు పునఃప్రారంభం కాగా, ఆగస్టు చివరి దాకా పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు బుక్స్‌ స్టోర్స్‌లో పాత పుస్తకాలను కొనుగోలు చేశారు. మరికొన్నిచోట్ల పూర్వ విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను తీసుకొని కొత్తవారికి ఇచ్చారు. విద్యాసంవత్సరం అయిపోతన్న విషయం తెలిసికూడా ఏ మాత్రం వేగంగా స్పందించని అధికారులు. తీరిగ్గా ఇండెంట్‌ ప్రకారం ముద్రించుకుంటూ వెళ్లిపోయారు. అప్పటికే సిలబస్ సగం అయిపోయింది. తరువాత ఆలస్యంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, ప్రైవేటు యాజమాన్యాలు పుస్తకాల్ని తీసుకునేందుకు నిరాకరించాయి. మరికొన్ని యాజమాన్యాలు 1-5 తరగతులకు సొంత సిలబస్‌ను అమలు చేస్తున్నందున ప్రభుత్వ పుస్తకాల్ని తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలన్ని వృధాగా మారాయి. జిల్లా గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,39,104 మంది విద్యార్థులు ఉండగా... దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఉచిత పాఠ్యపుస్తకాలు ముద్రించేశారు. 2022-23లో 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. వీరంతా ప్రైవేటుకు వెళ్లిపోయారు.

మారిపోయిన సిలబస్‌: పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంతోనే తీవ్ర నష్టం వాటిల్లిందని అనుకునే లోపే, పాఠశాల విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి చాలా పాఠ్య పుస్తకాల సిలబస్ ను మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికారులు ఏడాది నుంచి చేస్తున్న కసరత్తు అంతా వృధాగా మారింది. ఈ ఏడాది ముద్రించిన దాదాపు 35లక్షల పుస్తకాలు చిత్తు కాగితాల వేలంలో విక్రయించుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల ప్రణాళిక లోపంతో కోట్లాది రూపాయాల ప్రజాధనం నిరుపయోగమైంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి. ఎవరిపైన చర్యలు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఒకవేళ ఎవర్నో ఒకరిపైన చర్యలు తీసుకుంటే.. విద్యాశాఖకు అప్రతిష్ఠ వస్తుందనే ఉద్దేశంతో అందరూ మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చేసేది లేక.. వచ్చే సంవత్సరం సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాల్ని సిద్దం చేస్తున్నారు. 1-7 తరగతులకు గణితం, ఆంగ్లం, 6,7 తరగతులకు సామాన్యశాస్త్రం సబ్జెక్టుకు సంబంధించి కొత్తవి రానున్నాయి. తొమ్మిదో తరగతికి పూర్తిగా సీబీఎస్‌ఈ సిలబస్‌ పుస్తకాలనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం 1-5 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం పుస్తకాలను మూడు సెమిస్టర్లుగా ముద్రించి పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-9 తరగతులకు రెండు సెమిస్టర్లు అమలు చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో 8, 10 తరగతుల వాటినే తిరిగి వినియోగించుకునే అవకాశముంది. మిగతా వాటిలో తెలుగు, హిందీ భాష పుస్తకాలే ఉపయోగపడతాయి.
ఇవీ చదవండి

Last Updated :Jan 13, 2023, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.