ETV Bharat / state

జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో తెలుగు యువత పతకాల పంట- విద్యార్థులపై ప్రశంసల వెల్లువ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 4:53 PM IST

Telugu Students Karrasamu Skills: విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో తెలుగు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో కర్రలు పట్టుకుని యువత చేసిన విన్యాసాలపై పలువురు ప్రశంసలు కురిపించారు.

Telugu_Students_Karrasamu_Skills
Telugu_Students_Karrasamu_Skills

జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో తెలుగు యువత పతకాల పంట- విద్యార్థులపై ప్రశంసల వెల్లువ

Telugu Students Karrasamu Skills: విజయవాడ మాస్టర్ మైండ్ స్కూల్​లో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరేళ్ల బాల బాలికల నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ, యువకులు భాగస్వాములయ్యారు. అండర్- 6, అండర్ 19 కర్రసాము క్రీడలో ఆరు రాష్ట్రాలకు సంబంధించిన యువతీ, యువకులు వారి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో కర్రలు పట్టుకుని యువత చేసిన విన్యాసాలపై పలువురు ప్రశంసలు కురిపించారు.

ఏకాగ్రత పెరగడానికి, ఆత్మరక్షణకు, ధైర్యానికి కర్రసాము క్రీడ ఎంతో దోహదం చేస్తుందని యువ క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా బాలికలు తమని తాము రక్షించుకోవాడానికి కర్రసాము క్రీడ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణకు చెందిన సాయి కుమార్ కర్రసాము సింగెల్స్​లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదివారం వివిధ రాష్ట్రాల జట్ల మధ్య జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించగా తమిళనాడు రెండో స్థానం, తెలంగాణ జట్టు మూడో స్థానం కైవసం చేసుకున్నాయి.

'ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో నంబర్ వన్' సామాజిక అంశాలపై ఆసక్తి కొద్దీ మరో లక్ష్యానికి చేరువైన తులసి

ఎవరైనా మనపై దాడి చేస్తే ప్రతిఘటించడానికి ఉపయోగపడే విద్యల్లో కర్రసాము క్రీడ ఒకటి. ముఖ్యంగా ప్రస్తుతం మహిళలు, బాలికలపై అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు వారిని వారు రక్షించుకోవడానికి కర్రసాము క్రీడా చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆ కర్రసాము క్రీడ జాతీయ పోటీలకు విజయవాడ వేదికైంది. రాష్ట్ర శిలంబం (కర్రసాము) సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విజయవాడ రాజీవ్ నగర్​లోని మాస్టర్ మైండ్స్ స్కూల్ మైదానంలో నిర్వహించారు.

జాతీయ సంప్రదాయ కర్రసాము పోటీల్లో శనివారం ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది క్రీడాకారులు తలపడ్డారు. ఆదివారం 10మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. తొలి రోజైన శనివారం జరిగిన సింగిల్ స్టిక్ అండర్-6 బాలుర విభాగంలో ఎస్. ప్రశాంత్, బాలికల విభాగంలో ఎం. అశ్విక, అండర్-8 బాలుర విభా గంలో జి. శౌరియజ్ఞ, బాలికల్లో బి. శివ హృత్విక్ వల్లి, అండర్- 10 బాలుర విభాగంలో బీ.చేతన్, బాలికల్లో 05-12 బాలుర విభాగంలో ఎన్.కశ్యప్, బాలికల్లో ఏ.జయ రక్ష, అండర్-14 బాలుర విభాగంలో యశస్వి, బాలి కల్లో సుస్మిత, అండర్-16 బాలికల్లో వర్ణియ, అండర్- 18 బాలుర విభాగంలో కే.సాయి కుమార్, బాలికల్లో కే.శ్రీవల్లి, అండర్-19 బాలుర విభాగంలో దమ్బక్ నాద్, 19+ బాలికల విభాగంలో ఎన్.శ్వేత పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు.

'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం

ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతుందన్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కర్రసాము క్రీడకు మంచి ఆదరణ ఉందని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ కర్రసాము నేర్చుకునే క్రీడాకారుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆదివారం జరిగిన కర్రసాము క్రీడలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ జట్టు కేవసం చేసుకోగా రెండో స్థానంలో తమిళనాడు నిలిచింది. మూడో స్థానంతో తెలంగాణ జట్టు సరిపెట్టుకుంది.

చిన్నారులు సైతం ఈ క్రీడలో కర్రతిప్పిన దృశ్యాలు చూస్తే కళ్లు అదరాల్సిందే. తమ చేతిలో ఉన్న కర్రను అటూ ఇటూ తిప్పుతూ చూపర్లను ఎంతో ఆకట్టుకున్నారు. ఆకతాయిలు, తమపై దాడి చేస్తే వారిని తరమికొట్టడానికి ఈ క్రీడ ఎంతో దోహదం చేస్తుందని కర్రసాము క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. క్రీడల్లో వివిధ స్థాయిల్లో రాణిస్తే మంచి ఉద్యోగం సాధించడానికి దోహదం చేస్తుందని క్రీడాకారులు తెలిపారు. భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ కర్రసాము క్రీడాకారులుగా రాణిస్తామని విజయవాడలో జరిగిన కర్రసాము క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని పతాకాలు సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సొంతం చేసుకుంటామన్నారు.

కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్‌ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.