ETV Bharat / state

బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్​.. నేడు ఆవిర్భావ కార్యక్రమం

author img

By

Published : Dec 9, 2022, 9:09 AM IST

TRS becomes as BRS : తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్‌ రాష్ట్ర సమితిగా మారింది. ఈ మేరకు ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని గులాబీ దళపతి కేసీఆర్‌ నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ఈసీకి పంపించే పత్రాలపై సంతకం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు.

బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్​..
బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్​..

బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్​..

TRS becomes as BRS: టీఆర్ఎస్ ఇవాళ భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించనుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్​గా పేరుతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని కోరుతూ, దసరా రోజున ముహూర్తం ప్రకారం ఒంటి గంట 19 నిమిషాలకు పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అక్టోబరు 5న ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు.

TRS to BRS : నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌ 30రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాల గడువు ముగియడంతో, బీఆర్ఎస్​గా పేరు మార్చాలన్న టీఆర్ఎస్ వినతిని ఎన్నికల కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ పంపించింది. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ఈసీ పంపించిన లేఖకు పంపించే కేసీఆర్ సంతకం చేసి.. ఆవిర్భావాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

TRS Emerges as BRS : అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రంతో కూడిన గులాబీ జెండా టీఆర్ఎస్​ను ఇప్పటి వరకూ వినియోగిస్తుండగా, కొద్దిమార్పులతో బీఆర్ఎస్ జెండాను రూపొందించారు. గులాబీ రంగుపై భారతదేశం పటంతో బీఆర్ఎస్ జెండా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరు మాత్రమే మారినందున.. కారు గుర్తు యథాతథంగా కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలందరూ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరయ్యేందుకు... తెలంగాణ భవన్‌కు రావాలని కేసీఆర్ సూచించారు. జాతీయ ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్​కు పురుడు పోశారు.

త్వరలో బీఆర్ఎస్ అనుబంధ రైతు విభాగాలను ప్రకటించనున్నారు. దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొదట హైదరాబాద్ సంస్థానం పరిధిలోని కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమం తరహాలోనే నేరుగా ప్రజలను కదిలిస్తే, ఇతర పార్టీలు, నాయకులు కలిసొస్తారని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.

గుజరాత్ మోడల్ విఫలమైందని.. తెలంగాణ మోడల్ కావాలనే నినాదంతో భారత్‌ రాష్ట్ర సమితి ముందుకెళ్లనుంది. దళితబంధు, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్​కు మద్దతుగా నిలిస్తే దేశమంతా ఈ పథకాలను అమలు చేసి చూపిస్తామనే ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా విమానం కూడా కొనుగోలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.