ETV Bharat / state

TDP Leader Ashok Babu on Jagan Bail భవిష్యత్తులో జగన్, కేబినెట్ మొత్తం జైలుకెళ్లడం ఖాయం: టీడీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 6:18 PM IST

TDP MLC Ashok Babu on CM Jagan Ten-Years Bail: అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న సీఎం జగన్‌పై.. టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జైలులో ఉండాల్సిన జగన్ జనంలో ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిజాయతీపరుడు, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపారని ఆవేదన చెందారు.

TDP_MLC_Ashok_Babu_on_CM_jagan
TDP_MLC_Ashok_Babu_on_CM_jagan

TDP MLC Ashok Babu on CM Jagan Ten-Years Bail: వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పదేళ్ల బెయిల్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జైలులో ఉండాల్సిన జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఉండాల్సిన జగన్.. జనంలో ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో.. తానే ఓ కొత్తదారి చూపించాడని, భవిష్యత్‌లో జగన్ రెడ్డితోపాటు అతని కేబినెట్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటుందని ఆరోపించారు.

TDP MLC Ashok Babu Fires on YCP Ministers: స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ విషయంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ.. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకులు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Nara Lokesh Reacted on CM Jagan Bail: "జగన్​మోహన్​ రెడ్డికి​ బెయిల్​ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు"

TDP MLC Ashok Babu Comments: ''వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సేవకుడైన చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారు. తెలుగుదేశం ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో అతనే (జగన్) ఓ కొత్తదారి చూపించారు. భవిష్యత్తులో జగన్, ఆయన కేబినెట్ మొత్తం జైలుకెళ్లడం ఖాయం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదో మంత్రి బుగ్గన చెప్పాలి. బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. పాలకులు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

Dwarapureddy Jagadish Comments: అనంతరం వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో 13 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన మంత్రి బొత్స.. తమ పార్టీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స, ఇతర మంత్రులు, ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు. పాలకులు రాజ్యాంగ వ్వవస్థల్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వాపోయారు.

Motkupalli on Chandrababu Arrest : 'ముష్టి రూ.300 కోట్లకు చంద్రబాబు ఆశపడతారా?.. జైల్లో ఆయనకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యత'

రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై చట్ట సభల్లో పోరాడుతుంటే. 200 మార్షల్స్‌ను పెట్టి సభలను నడిపిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో నాలుగైదు వందల మందిపై పోలీసులు కేసులు పెట్టడం హేయమైన చర్య. ప్రజలను వేధిస్తున్న పాలకులకు, పోలీసులకు త్వరలోనే బుద్ధి చెప్తారు.-గొట్టిపాటి రవి, అద్దంకి ఎమ్మెల్యే

TDP leaders met Nara Bhuvaneshwari నారా భువనేశ్వరీ, బ్రహ్మణీతో భేటీ అయిన సీనియర్ టీడీపీ నేతలు.. వైసీపీ నేతలకు జైళ్ళు సరిపోవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.