ETV Bharat / state

'డీబీటీ స్కీమ్‌ కింద భారీ కుంభకోణం - వైసీపీ నాయకుల జేబుల్లోకి, తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.వేల కోట్లు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 9:20 PM IST

Updated : Nov 8, 2023, 10:10 PM IST

TDP_Leader_Devineni_Uma_on_CM_Jagan
TDP_Leader_Devineni_Uma_on_CM_Jagan

TDP Leader Devineni Umamaheswara Rao on CM Jagan: వైసీపీ పాలనలో డీబీటీ స్కీమ్‌ కింద రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ స్కీమ్‌ ద్వారా రూ.వేల కోట్లు వైసీపీ నాయకుల జేబుల్లోకి, తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయం నాటి 120 పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leader Devineni Umamaheswara Rao on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై.. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు హిట్లర్ వద్ద పని చేసిన గోబెల్స్‌ను.. నేడు జగన్ వద్ద పని చేస్తున్న సజ్జల మించిపోయాడని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి, ప్రజలకు జగన్ ఎందుకు అవసరమో సజ్జల చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్​ (డీబీటీ) స్కీమ్‌ కింద రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని దేవినేని ఉమ ఆరోపించారు.

Devineni Uma on AP Hates Jagan: వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనపై.. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఏపీ హేట్స్ జగన్ పేరుతో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన కరపత్రంలోని విషయాలను వివరిస్తూ.. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ మంత్రులపై ప్రశ్నల వర్షం కురిపించారు. డీబీటీ స్కీమ్‌ కింద రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన దేవినేని ఉమ - గోదావరికి పూజలు

Devineni Uma Comments: డీబీటీ స్కీమ్‌ కింద వైసీపీ నాయకులు రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని.. దేవినేని ఉమ ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్‌కు, వైసీపీ నాయకుల జేబుల్లోకి వేల కోట్ల రూపాయలు వెళ్లాయని ఆయన దుయ్యబట్టారు. గత నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ల కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఉప ప్రణాళిక నిధులు రూ.14 వేల కోట్లు పక్కదారి పట్టించడమే కాకుండా.. గత ప్రభుత్వ హయం నాటి 120 పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను కొల్లగొట్టరన్న దేవినేని.. విశాఖలో విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టి.. కృష్ణా జలాల్లో వాటాపై రాష్ట్ర హక్కులను కాలరాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Devineni Uma On Polavaram: సీఎం జగన్​రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపం : దేవినేని ఉమ

''ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అవసరమో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. వివేకానందరెడ్డిని చంపిన వారిని కాపాడేందుకా..?. దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనను ప్రశ్నించిన మీడియా, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టేందుకా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలను రక్షించేందుకా..? లేక మహిళలపై దారుణాలకు తెగబడుతున్న కామాంధులకు కొమ్ముకాసేందుకా..? ఈ రాష్ట్రానికి జగన్ వల్ల ఏ ఉపయోగం లేదు. పట్టిసీమ పంపులను పీకుతామన్న జగన్ రెడ్డికి.. దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ లిఫ్ట్ జోలికి వెళ్లాలని నేను సవాల్ విసురుతున్నా.''- దేవినేని ఉమామహేశ్వరావు, టీడీపీ నేత

Devineni Uma On Polavaram: పోలవరం డ్యామ్ దౌర్భాగ్య పరిస్థితికి జగన్నాటకమే కారణం: దేవినేని ఉమ

Last Updated :Nov 8, 2023, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.