ETV Bharat / state

రాష్ట్రంలో ముగిసిన సీజేఐ పర్యటన

author img

By

Published : Dec 30, 2022, 9:38 PM IST

CJI Chandrachud: ఆంధ్రప్రదేశ్​కు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.చంద్రచూడ్ కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. నేడు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీజేఐ.. సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

CJI Chandrachud
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.చంద్రచూడ్

CJI Chandrachud in AP: ఆంధ్రప్రదేశ్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.చంద్రచూడ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. సీజేఐకి అధికారులు ఘన వీడ్కోలు పలికారు. నేడు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సీజేఐ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సీజేఐకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ జాషువా, హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలికారు.

వివిధ కార్యక్రమాల్లో సీజేఐ: మంగళగిరిలోని కాజ వద్ద నిర్మించిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతోపాటు .. ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్టును ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఆన్ లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్​ను ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.