ETV Bharat / state

Students Missing In krishna River : కృష్ణా నదిలో విద్యార్థులు గల్లంతు.. ఒకరు మృతి

author img

By

Published : May 9, 2023, 10:45 AM IST

Students Missing In krishna River : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నదిలో గల్లంతైన వారు ఇటీవలే పదో తరగతి పాసైన ఇద్దరు విద్యార్థులుగా గుర్తించారు. వారిలో రత్న రాకేష్(15) మృతదేహం లభ్యం అయ్యింది. అధికారులు మరో విద్యార్థి జాన్ బునియన్(15) కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Etv Bharat
Etv Bharat

Students Missing In krishna River : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతుకాగా ఒకరి మృతదేహం లభ్యమైంది. సోమవారం చింతకాయల కోసం నలుగురు వెళ్లారు. ఆ నలుగురు కృష్ణా నదిలోకి ఈతకు దిగగా అదుపు తప్పి ఊబిలోకి జారిపోయారు. భయాందోళనకు గురైన కమల్‌, జీవన్‌ ఒడ్డుకు చేరుకున్నారు. రత్న రాకేష్(15), జాన్ బునియన్(15) నది ఒడ్డుక చేరుకోలేకపోయారు. నదిలో గల్లంతైన వారు ఇటీవలే పదో తరగతి పాసైన విద్యార్థులుగా గుర్తించారు. వారిలో రత్న రాకేష్(15) మృతదేహం లభ్యం అయ్యింది. మరో విద్యార్థి జాన్ బునియన్(15) కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇసుక లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. డ్రైవర్​కు తీవ్ర గాయాలు : అనకాపల్లి జిల్లా జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చీరాల నుంచి శ్రీకాకుళానికి 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు, నక్కపల్లిలో ఆసుపత్రి కూడలి వద్దకు రాగానే మలుపు తిరుగుతున్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీరాలకు చెందిన డ్రైవర్ తేళ్ల సుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు వివిధ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పోలీసులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టారు.

ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి : అనకాపల్లి జిల్లా కసింకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న ఆటోని వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ తలుపుల రాజు (32), కూరగాయల వ్యాపారి మునగపాక లక్ష్మి (52)
అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన అంబులెన్స్.. మహిళ మృతి : అనంతపురం జిల్లా వడ్రహొన్నూర్ వద్ద ద్విచక్రవాహనాన్ని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెదింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

గేదెల మందను ఢీకొట్టిన కారు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముత్రాసుపల్లి గ్రామ సమీపంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీకట్లో రోడ్డుపై వెళ్తున్న గేదెల మందను కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో నాలుగు గేదెలు మృతి చెందగా మరో రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ కూడా ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ లక్ష్మణ్​ను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ ఫిరోజ్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా పశువుల యజమానులు చీకటి పడక ముందే వారి పశువులను ఇంటికి చేర్చేలా చూసుకోవాలని సూచించారు.
అదుపు తప్పి బోల్తా పడిన రెండు లారీలు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెస్ట్ బెంగాల్​కు చెందిన ఎక్సైడ్ బ్యాటరీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రహదారి పై వెనక నుంచి వస్తున్న మరొక లారీ బ్యాటరీ లారీ వైపు క్రాస్ చేయడంతో ఒక్కసారిగా లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తాపడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

ట్రాక్టర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ట్రాక్టర్​ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ(16), నూకల అనూష(22)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇరువురినీ మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.