"కథలు చెబుతాము.. ఊ కొడతారా".. స్టోరీ టెల్లింగ్​లో దూసుకుపోతున్న ఆ ఇద్దరు

author img

By

Published : Mar 5, 2023, 7:04 AM IST

Updated : Mar 8, 2023, 7:10 AM IST

STORY TELLERS INTERVIEW

STORY TELLERS SPECIAL INTERVIEW: కథలంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరూ. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ వాటిని ఇష్టపడతారు. చిన్నప్పుడు కథలు వింటూ అమ్మచేతి గోరుముద్దలు తిని హాయిగా బజ్జునే వరకూ పిల్లలు అదో రకమైన ఊహాలోకంలో తేలిపోతారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అలవాట్లు మారుతున్నాయి. ఉద్యోగాల రీత్యా గ్రామాలను వదిలి పట్టణాల్లో స్థిరపడి తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇలాంటి సమయాల్లో వాళ్ల పిల్లలకు కథలు చెప్పే తీరిక ఎక్కడుంటుంది. అలాంటి వారి కోసమే కథలనే వ్యాపకంగా మలచుకుని ఇద్దరు మిత్రులు కలిసి చేస్తున్న ఈ ప్రయాణమే స్టోరీ టెల్లింగ్​..

స్టోరీ టెల్లింగ్​లో దూసుకుపోతున్న ఆ ఇద్దరు

STORY TELLERS INTERVIEW : చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ కథలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ నేటీ సమాజంలో పెద్దలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. పిల్లలు మాత్రం ఫోన్​లకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితం అలవాటై పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు. కనీసం పాఠశాలల్లో అయినా పిల్లలకు విజ్ఞానపరమైన కథలు చెబుతారా అంటే అది కూడా కష్టమే. కేవలం ర్యాంకుల కోసం మాత్రమే పోటీపడేలా వారిని తయారు చేస్తున్నారు.

కథలు చిన్నారుల జీవితాలను చాలా వరకు ప్రభావితం చేస్తాయనేది అందరికీ తెలిసిందే. కానీ కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు.. పిల్లలను కథలు వినేందుకు చదివేందుకు దూరం అయ్యేలా చేస్తున్నాయి. ఎప్పుడూ స్మార్ట్​ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్‌లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ఊబకాయం తదితర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు మిత్రులు మాత్రం "మీ పిల్లలు తెలివైన వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి" అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన మాటలనే ఉపాధిగా ఎంచుకున్నారు ఈ ఇద్దరు స్నేహితులు..

స్టోరీ టెల్లింగ్​.. కథలు చెప్పడం అనేది ప్రతి వ్యక్తికి చిన్నతనం నుంచి ఉండే విద్య. కొందరు దానికి సృజనాత్మకతను జోడించి డబ్బులు సంపాదిస్తుంటే.. మరి కొందరు దానిని తేలిగ్గా తీసుకుంటుంటారు. దశాబ్ధాల క్రితం వరకు ప్రతి చిన్నారికి తన నాన్మమ్మ, తాతయ్యలు కచ్చితంగా కథలు చెప్పేవాళ్లు. కానీ ఉరుకుల పరుగుల నేటి కాలంలో మంచి కథలతో పాటు, కథలు చెప్పే వాళ్లు కనిపించడం లేదు. నగర జీవితంలో కుటుంబాలు చిన్నవైపోవడం.. నాన్మమ్మ, తాతయ్యలు పిల్లల దగ్గర ఉండే పరిస్థితులు లేకపోవడం.. తమ జీవన యానంలో పడిపోయిన తల్లిదండ్రులు పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక దొరక్కపోవడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి. అయితే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా తేలికైన విషయం కాదు. ఈ విభాగంలో ఇప్పుడు అనేక నిపుణులు తయారవుతున్నారు. మహానగరాలతో పాటు విద్యా సంస్థలకు ఈ నిపుణులు వెళ్లి కథలు చెప్పడమే వ్యాపకంగా పని చేస్తున్నారు.

బాలోత్సవాలు, పుస్తక మహోత్సవాలు వంటి ఎక్కువ మంది జనసమర్దత ఉండే చోట్ల కూడా కథ చెబుతా.. ఊ కొడతారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కథల ద్వారా పరిచయమైన ఇద్దరు మిత్రులు ఇదే వ్యాపకానికి తమ సృజనను జోడించి.. చిన్నారులకు వారికి ఇష్టమైన భాషలో సంక్షిప్తంగా.. సరళంగా కథలు చెబుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. గత నెల ఫిబ్రవరిలో జరిగిన పుస్తక మహోత్సవంలో ఇద్దరు మగువలు మేఘన, హరిప్రియలు స్టోరీ టెల్లింగ్​ని ఉపాధిగా మార్చుకుని విజయం సాధిస్తున్నారు. వారి విజయగాథను వారి మాటల్లోనే విందాం.

మాటల ద్వారా కాకుండా కథల ద్వారా చెప్తే పిల్లలపై ప్రభావం ఎక్కువ: మేఘన
"నేను కథలు చెప్పడం మొదలు పెట్టి 7 సంవత్సరాలు దాటింది. చాలా ఈవెంట్స్​కి వెళ్లి కథలు చెప్పేవాళ్లం. విజయవాడకు రావడం ఇదే మొదటిసారి. పిల్లలే కాకుండా పెద్దలు సైతం చాలా బాగా ఎంజాయ్​ చేశారు. మేము ఇక్కడ ఎక్కువ చెప్పింది జానపద కథలు. మాములుగా కథలు చెప్పినట్లు కాకుండా పప్పెట్స్​(తోలుబొమ్మలు)ద్వారా పిల్లలకు కథలు చెప్పాము. సుధామూర్తి రాసిన కథలు కొన్ని.. ప్రభావితం చేసే కథలు చెప్పాం. కథలు చెప్పడంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎంటర్​టైన్​మెంట్​ అయితే.. మరొకటి నీతి కథలు" అని మేఘన తెలిపారు.

"ఉమ్మడి కుటుంబాల కాలంలో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలాంటివి కనుమరుగవుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన దగ్గర నుంచి మనుషుల మధ్య దూరం పెరిగింది. కమ్యూనికేషన్​ స్కిల్స్​ కూడా తగ్గిపోయాయి. పిల్లలకు చెప్పే మంచి విషయాలను కేవలం మాటల ద్వారా కాకుండా కథల ద్వారా చెప్పడం వల్ల అవి పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తాయి" అని అంటున్నారు మేఘన..

నా ప్రయాణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు: హరిప్రియ
"నేను స్టోరీ టల్లర్​గా నా ప్రయాణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయ్యింది. సింగపూర్​లో ఎమ్​ఎస్​ చేశా. నేను ఇండియాకు వచ్చినప్పుడు లైబ్రరీలు ఎక్కువ లేవు. అందుకే హైదరాబాద్​లో లైబ్రరీ స్టార్ట్​ చేశా. దాని పేరు "బుక్​ షెల్ఫ్​". ప్రథమ్​ బుక్స్​ ద్వారా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఎన్జీవోల సాయంతో స్కూల్లు, పార్కుల్లో కథలు చెప్పేదాన్ని" అని అంటున్నారు హరిప్రియ.

"నేటి జనరేషన్​ పిల్లలకు డిజిటల్​ అందుబాటులో ఉంది. పిల్లలు ఎక్కువగా గ్రాఫిక్స్​ను ఇష్టపడతారు. పుస్తకాలల్లో గ్రాఫిక్స్​ విజువల్స్​ ద్వారా క్లాసెస్​ చెప్తే పిల్లలకు వాటిపై ఇష్టం పెరుగుతుందనేది నా అభిప్రాయం. అలానే కేవలం కథలు మాత్రమే కాకుండా.. పిల్లలు నాలెడ్జ్​ పెంచే విధంగా క్లాసురూముల్లో పాఠాలను సైతం కథలుగా చెప్పే.. మానసిక ప్రశాంతతో పాటు పిల్లల విజ్ఞానాన్ని పెంపొదించవచ్చు" అని హరిప్రియ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 8, 2023, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.