Andhra Pradesh Road Transport Corporation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గత కొద్ది కాలంగా సంస్థాగతంగా కీలకమైన మార్పులు తీసుకువస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నగదు రహిత టికెట్ల జారీ పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ప్రయాణిికులు పడే ఇబ్బందులను తగ్గించగలిగింది. నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ ప్రవేశపెట్టినందుకు కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) జాతీయ స్థాయి అవార్డు సాధించింది. 2022 ఏడాదికి గాను స్కోచ్ అవార్డును గెలుచుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీ పడి అవార్డు సాధించింది. సంస్థలో నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ ప్రవేశపెట్టినందుకు అవార్డుకు ఎంపికైంది. వర్చువల్ సెమినార్ ద్వారా అవార్డును ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి అందుకున్నారు.
ఇవీ చదవండి: