Round table meeting on R5 Zone ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపు వెనుక రాజకీయ కుట్ర..రౌండ్​టేబుల్ సమావేశం

author img

By

Published : May 14, 2023, 7:52 PM IST

Etv Bharat
Etv Bharat ()

Round Table Meeting: ఆర్5జోన్​కు వ్యతిరేకంగా విజయవాడలోని ఓ హాటల్లో ఎస్సీ, బిసి మేథావులు, రైతులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 50 వేల మందికి నూతన ఇళ్లను కేటాయించి.. లక్షన్నర ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఎత్తుగడగా జగన్ ప్రభుత్వం పథకం వెసిందని.. వక్తలు అభిప్రాయపడ్డారు. ఓటుబ్యాంకు కోసం మంచి భవిష్యత్ ఉన్న రాజధానిని ఎదగనీయకుండా చేసే కుట్రలను తిప్పికొట్టాలని.. మేథావులు పిలుపునిచ్చారు.

Round Table Meeting in Vijayawada:అమరావతి రాజధానిలో ఆర్-5జోన్ పేరుతో రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హాటల్లో ఆర్- 5 జోన్ పేరుతో జరుగుతున్న మోసాలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా జోన్ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు. ఆర్- 5 జోన్ మోసాలపై సమష్ఠిగా పోరాడాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు.


ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ మా శవాలపై నుంచే జరపాలని దళిత రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుందన్నారు. పేదల ఇళ్ల పట్టాల పేరుతో రాజధానిలో జరుగుతున్న మోసాలపై విజయవాడ ఓ హాటల్లో ఎస్సీ, బిసి మేథావులు, రైతులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వం దళిత రైతులకు సైతం న్యాయం చేసే విధంగా సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించిందని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ అన్నారు.

ఈ సందర్భంగా.. జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల పేరుతో రాజధాని రైతులు.. స్థానికేతరుల మధ్య వైషమ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. స్థలాలను త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన అవసరముందఅన్నారు. అమరావతిలోని ప్రతీ రైతు ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. పేదవాళ్లకి భూమి అనే పేరుతో వైసీపీ నేతలు రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. 50 వేల మందికి నూతన ఇళ్లను కేటాయించి.. లక్షన్నర ఓటు బ్యాంకును సంపాదించేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని వేసిందన్నారు. ఆర్ 5 జోన్ ను నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారన్నారు. దీనిపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే దళిత, బిసీ మైనార్టీలు కలిసికట్టుగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

పేదల ఇళ్ల పట్టాలను రైతులు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని CPI నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. రాజధాని సమస్య 29 గ్రామాల రైతులది కాదని .. 26 జిల్లాల ప్రజలదని వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజధానిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం హడావుడిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోందని జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ఆరోపించారు. ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామని రైతులు తెలిపారు. కలిసి కట్టుగా పోరాటం చేసి అమరావతిని రక్షించుకోవాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మేధావులు పిలుపునిచ్చారు.

ఆర్‌-5 జోన్‌ మోసాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం
ఇవీ చదవండి:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.