ఏపీకి, తెలంగాణకి ఉన్న ఆయిల్​పామ్ ధరల వ్యత్యాసాన్ని తగ్గిస్తాము: మంత్రి కాకాణి

author img

By

Published : Jan 7, 2023, 4:25 PM IST

Minister Kakani Govardhan Reddy

Minister Kakani Govardhan Reddy: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయిల్​పామ్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్​రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఆయిల్​పామ్ ధరల ఫార్ములా ఖరారు కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి అధికారులు, రైతులతో మాట్లాడారు. ఆయిల్ రికవరీని శాతాన్ని, నట్స్ రికవరీ శాతాన్ని పరిగణిస్తూ రైతులకు ఆయిల్​పామ్ ధరలను చెల్లిస్తున్నట్టు తెలిపారు.

Minister Kakani Govardhan Reddy: రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ఆయిల్​పామ్ ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఆయిల్​పామ్ ధరల ఫార్ములా ఖరారు కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి అధికారులు, రైతులతో మాట్లాడారు. ఆయిల్​పామ్ రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఆయిల్​పామ్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తామన్నారు. రాష్ట్రంలోని ఆయిల్​పామ్ రైతులకు రూ.84 కోట్ల మేర వ్యత్యాస ధరను చెల్లించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

పామాయిల్ సీడ్స్ నుంచి ఆయిల్ ఎక్స్​ట్రాక్షన్ రేషియే శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ శాతాన్నే ఏపీలో కూడా అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఎఫ్​బి ధరను రూ.18,300/- రూపాయలను రైతులకు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు. 2021 నవంబరు 1 నుంచి 2022 అక్టోబరు 31 వరకూ ఆయిల్ రికవరీని 19.22 శాతాన్ని, నట్స్ రికవరీ శాతాన్ని 10.25 గాను పరిగణిస్తూ రైతులకు ఆయిల్​పామ్ ధరలను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనూ మెరుగైన రీతిలోనే ఎఫ్ఎఫ్​బీని పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.