ETV Bharat / state

Mango prices: వ్యాపారులకు కాసులు.. వినియోగదారులకు చుక్కలు

author img

By

Published : May 11, 2023, 3:01 PM IST

Mango prices in market: అకాల వర్షాలకు కాయలు రాలి రైతులకు చేదును మిగిల్చిన మధుర ఫలం.. వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. నాణ్యత లేక ఎగుమతులు తగ్గడం వల్ల మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. విజయవాడలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫలరాజును కొనలేని విధంగా ధరలు మండిపోతున్నాయి.

Mango prices in market
Mango prices in market

ఆకాశాన్నంటిన మామిడి ధర.. సామాన్యులకు అందేనా..!

Mango prices in market: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాల కారణంగా మామిడి కాయలు నేల రాలడంతో ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మామిడి ధర వ్యాపారులకు కాసులు కురిపిస్తుంటే.. కొనుగోలు దారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. గత వారం రోజులుగా మార్కెట్​లలో మామిడి కొనుగోళ్లు తగ్గాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా వీచిన ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో డిమాండ్ తగ్గి సరఫరా లేకపోవడంతో మార్కెట్​లో మామిడి ధరలకు రెక్కలొచ్చాయి. 15 రోజుల క్రితం వరకు బంగినపల్లి కాయలు డజను 300 రుపాయలు ఉంటే ఇప్పుడు 450 వరకు పెరిగాయి. ఆదే 60 కాయల బుట్ట గతంలో రూ.1200 వరకు ఉండగా నేడు రూ.1500 వరకు పలుకుతున్నాయి. రసాలు డజను 450 రుపాయలు నుంచి 700 రుపాయాల పైనే పలుకుతున్నాయి. 60 కాయల బుట్ట సైజును బట్టి 1800 రుపాయల వరకు పలుకుతున్నాయి. ఒక్కసారిగా ఇలా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నారు.

మార్కెట్​లో మామిడి కాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు న్యాయం జరగడం లేదు కానీ వ్యాపారులకు మాత్రం డబ్బులు మిగులుతున్నాయని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట కావడంతో ఇంత రేటు ఉన్నా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయడం జరుగుతుందని వారు పెర్కొన్నారు. కాయ నాణ్యతను బట్టి వ్యాపారులు అమ్ముతున్నారు. మామిడికాయ పరిమాణాన్ని బట్టి ఒక్కొ కాయను వ్యాపారులు 150 రుపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇదేమని అడుగుతుంటే వర్షాలు వచ్చి పంట నష్టం వచ్చిందని అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు.

రైతులు మార్కెట్​కు తీసుకువచ్చిన కాయలను వ్యాపారులు టన్నుల లెక్కల కొనుగులు చేస్తారు. ప్రధానంగా నున్న మ్యాంగో మార్కెట్​కు రైతులు తోట నుంచి నేరుగా కాయలను తీసుకువస్తారు. ఇక్కడి నుంచే చిన్న వ్యాపారులు కాయలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్​కు కూడా రైతులు మామిడిని తీసుకువస్తారు. ఇక్కడికి తీసుకు వచ్చిన కాయలను వ్యాపారులు పండిస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన చిన్న వ్యాపారులు సరుకును తీసుకువెళ్తారు. మార్కెట్​లో ఉన్న ధరకు వ్యాపారులు కొద్దిపాటి లాభాన్ని చూసుకుని కాయలను విక్రయిస్తారు.

మార్కెట్​లోనే కాయల రేట్లు అధికంగా ఉండటం వల్ల తాము కూడా అధిక ధరకు విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో కాయలో నాణ్యత లోపించడంతో కాయలు రెండు, మూడు రోజులకే కుళ్లిపోతున్నాయని చెబుతున్నారు. మామిడి కాయలు పాడైపోవడంతో తాము ఆర్ధికంగా నష్టపోతున్నామని తెలిపారు. మామిడి ధరలు పెరగడంతో మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు భయపడుతున్నారు. అకాల వర్షం రైతును నట్టేటా ముంచితే వ్యాపారులకు మాత్రం లాభాలను తీసుకువస్తుంది. మామిడి ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది మధుర ఫలం రుచిని అనుకున్నంతగా ఆస్వాదించలేకపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.