ETV Bharat / state

గ్రూప్-1 పరీక్షలో సెల్​ఫోన్ కాపీయింగ్.. పట్టుబడ్డ వార్డు సచివాలయ ఉద్యోగి

author img

By

Published : Jan 9, 2023, 9:07 AM IST

Student Mass copying in Group-1 exam: గ్రూప్-1 పరీక్ష చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. కానీ అటువంటి పరీక్షలో ఓ వార్డు సచివాలయ ఉద్యోగి అయిన కొల్లూరి వెంకటేష్.. సెల్​ఫోన్​లో చూసి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. సెల్​ఫోన్​ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాడు అనేది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Mass Copying
సెల్​ఫోన్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి

Student Mass copying in Group-1 exam: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగి సెల్​ఫోన్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడటం కలకలం రేపుతోంది. పోరంకి చెందిన కొల్లూరి వెంకటేష్ సీతారాంపురం సచివాలయం వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయ ఉద్యోగి వెంకటేష్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను చంద్రబాబునాయుడు కాలనీలోని నారాయణ కళాశాలలో ఆదివారం రాశాడు. పోలీసుల కళ్లు కప్పి చరవాణిని పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన వెంకటేష్‌.. అంతర్జాలంలో చూస్తూ సమాధానాలు రాస్తుండగా గమనించి ఇన్విజిలేటర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంకటేష్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించే గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. తనిఖీలను దాటుకొని పరీక్ష కేంద్రంలోకి చరవాణిని తీసుకెళ్లడం, గంటసేపు తర్వాత గుర్తించటం.. పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.