ETV Bharat / state

సంకల్ప సిద్ధిస్కామ్​లో వైసీపీ ఎమ్మెల్యేల హస్తముంది: కొమ్మారెడ్డి పట్టాభిరాం

author img

By

Published : Nov 25, 2022, 2:00 PM IST

Kommareddy Pattabhi Ram spoke on Sankalpa Siddhi scam: సంకల్ప సిద్ధి కుంభకోణం వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. వాటాల్లో తేడా వచ్చినందుకే.. ఈ స్కామ్ బయటకొచ్చిందని ఆరోపించారు..స్కామ్​లు వెలికితీసేందుకే ఏర్పాటు చేసిన సీఐడీ.. ఈ కేసును ఎందుకు గురించి వివరాలు ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు.

Kommareddy Pattabhi
కొమ్మారెడ్డి పట్టాభిరాం

Kommareddy Pattabhi Ram spoke on Sankalpa Siddhi scam: సంకల్ప సిద్ధి కుంభకోణం వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ ప్రధాన అనుచరుడిని ముందుంచి.. సంకల్ప సిద్ధి భోగస్ కంపెనీని నడిపారని మండిపడ్డారు. కంపెనీ స్థాపించిన గుత్తా కిరణ్, గుత్తా వేణుగోపాల్.. కొడాలి నాని, వంశీ బినామీలు అని పేర్కొన్నారు.

లక్ష రూపాయల పెట్టుబడితో.. ఈ ఏడాది మే నెలలో సంస్థను ప్రారంభించి.. 1100కోట్ల పేదల సొమ్ము దోచేశారని ఆరోపించారు. కొడాలినాని అత్యంత సన్నిహితుడు, వంశీ ప్రధాన అనుచరుడు ఓబులపల్లి రంగా కంపెనీ వ్యవహారాలన్నీ చూశారన్నారు. 20వేలు పెట్టుబడి పెడితే 10నెలల్లో 60వేలు ఇస్తామంటూ పేదల బలహీనతతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీర్వాదం లేకుండా.. ఇలాంటి పెద్ద స్కామ్ జరగటం అసాధ్యమన్నారు. వాటాల్లో తేడా వచ్చినందుకే.. ఈ స్కామ్ బయటకొచ్చిందని ఆరోపించారు.. అందుకనే కొడాలినానికి పార్టీలోనున్న ఆ ఒక్క పదవి పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కొల్లగొట్టిన డబ్బును బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు తరలించి బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి స్కామ్​లు వెలికితీసేందుకే ఏర్పాటు చేసిన సీఐడీ.. ఈ కేసును ఎందుకు గురించి వివరాలు ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.