ETV Bharat / state

కేఎల్ యూనివర్సిటీ ఫలితాలు విడుదల.. ఆ విద్యార్థులకు 100 శాతం ఫీజులో రాయితీ

author img

By

Published : Jan 7, 2023, 6:32 PM IST

KL Engineering Entrance Exam Results
కేఎల్‌ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

KL University VC Dr. Parthasarathi Verma: ప్రముఖ విద్యాసంస్థ కేఎల్‌ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి మరో విడత ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేఎల్ వీసీ డాక్టర్ పార్ధసారధి వర్మ మీడియాకు వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు వారి మార్కుల ఆధారంగా 10% నుంచి 100 శాతం ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

KL Engineering Entrance Exam Results: ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్​ అంటే మనకు గుర్తుకు వచ్చేవి ఐఐటీలు ఎన్ఐటీలే. ఆ విద్యాసంస్థలు ప్రభుత్వ రంగానికి చెందినవి. వాటిలో కాకుండా నాణ్యమైన విద్యాబోధన కోసం విద్యార్థులు ఈ మధ్య కాలంలో వివిధ ప్రైవేట్ విశవిద్యాలయాలు వైపు చూస్తున్నారు. అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి వివిధ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. అదే కోవకు చెందినదే కేఎల్ యూనివర్సిటీ. దేశంలో ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఒకటిగా పేరు పొందిన ఈ యునివర్సిటీ, విద్యార్థుల్లో ప్రతిభను ఆధారంగా చేసుకొని స్కాలర్​షిప్ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఇంజనీరింగ్​ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు 10% నుంచి 100 శాతం వరకు ఫీజులో రాయితీ ఇస్తుంది. మెరిట్ స్కాలర్​షిప్ కోసం గత డిసెంబర్​లో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను వెల్లడించింది.

ఫిబ్రవరి మూడో తేదీ నుంచి రెండో విడత ప్రవేశ పరీక్ష: కేఎల్‌ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి రెండో విడత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేఎల్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు. కేఎల్‌ యూనివర్సిటీ చెందిన విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్​లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబందించి మెరిట్ విద్యార్థులను ప్రోత్సహంచేలా దేశ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో నిర్వహించారు. ఆ ప్రవేశ పరీక్షా ఫలితాల వివరాలను నేడు విజయవాడలోని యూనివర్సిటీ పరిపాలన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఫీజు రాయితీ: ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఇంటర్ మార్కులు, జేఈఈ పరీక్షల్లో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా తమ క్యాంపస్​లలో ఇంజనీరింగ్ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులకు 10% నుంచి 100 శాతం ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఫీజు రాయితీ కోసం ప్రతి ఏటా రూ. 100 కోట్ల మేర ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని, పార్ధసారధి వెల్లడించారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులను సైతం ప్రోత్సహించి వారికి అత్యుత్తమ విద్యను అందించేలా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

బిర్యానీ తిని చనిపోయిన మహిళ.. విచారణకు ఆరోగ్య శాఖ ఆదేశం

రూ.15 వేలలోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లు ఇవే

మన హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.