ETV Bharat / state

Temperature: మండుతున్న ఎండలు.. జంకుతున్న ప్రజలు

author img

By

Published : Apr 15, 2023, 5:05 PM IST

Summer Temperatures : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. పగటి వేళ ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే.. ఎండ తీవ్రతకు భయపడిపోతున్నారు. దాదాపు పగటి వేళ పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఎండ వేడి ప్రభావంతో విజయవాడలో రాహదారులపై వాహనాల రద్దీ తగ్గిపోయింది.

Summer Temperatures
రాష్ట్రంలో ఎండలు

నాలుగు రోజులుగా అధిక ఉష్ణ్రోగ్రతలు నమోదు

Temperatures Increased In Vijayawada: గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. మధ్యాహ్నం వేళ ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి ప్రజలు పగటి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలతో రద్ధీగా ఉండే విజయవాడలోని రహదారులు.. ఎండ తీవ్రత అధికం కావటంతో వాహనాల రాకపోకలు అంతంతా మాత్రంగానే ఉంటోంది. తప్పనిసరి అత్యవసర పరిస్థితుల వల్ల ఎండలో బయటకు వెళ్తున్న ప్రజలు దాహార్తిని తీర్చుకోవటానికి ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో.. చలివేంద్రాల సంఖ్య తగ్గింది. దీనివల్ల ప్రజలు పదుల రూపాయలు వెచ్చించి తాగునీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్న దినసరి కూలీలు, ఇతర అవసరాలకు బయటకు వెళ్తున్నవారు ఎండ వేడి వల్ల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావటం లేదు : విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులో ఎండ తీవ్రత వల్ల వాహనాల తాకిడి తగ్గిపోయింది. ఎండ వేడిమికి ప్రజలు భయంతో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప పగటి వేళ బయటకు రావటం లేదు. ఇదే సందర్భంలో శీతాల పానీయాల విక్రయ కేంద్రాలకు మంచి ఆదాయం సమాకూరుతోంది. వివిధ పనుల కోసం బయటకు వచ్చేవారు.. దప్పిక తీర్చుకోవటానికి శీతల పానీయాలు, పళ్ల రసాలను సేవిస్తున్నారు. చలివేంద్రాల సంఖ్య తక్కువ కావటంతో వీటిని తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో శీతల పానీయల సంఖ్య పెరిగింది. అయితే అధిక శాతం అధికంగా శీతల పానీయలు సేవిస్తే ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఎండలో బయటకు వెళ్లినపుడు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను, సలహాలు, సూచనలను నిపుణులు అందిస్తున్నారు. అంతేకాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఎండకు వెళ్లినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు వీటి వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కలగటమే కాకుండా.. వడదెబ్బకు గురికాకుండా ఉండవచ్చని అంటున్నారు.

ఎండకు వెళ్లినపుడు చేయాల్సినవి : ఎండలు పెరుగుతున్న తరుణంలో నిత్యావసరాలకు, ఇతర పనులకు ఉదయం, సాయత్రం వేళ బయటకు వెళ్లాలని సలహాలు అందిస్తున్నారు. వీలైనంత వరకు పనులను ఎండ తక్కవ ఉన్న సమయాలకు వాయిదా వేసుకోవటం మంచిందని నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో బయటకు రావాలని.. ఒకవేళ ఎండలో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపి, కాటన్​తో తయారు చేసిన తెల్లని వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవసరమని వివరిస్తున్నారు. నీరు ఎక్కువగా తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలని.. వీటివల్ల ఎండదెబ్బ తగలకుండా ఉంటుందంటున్నారు.

"నాలుగు రోజులుగా మార్కెట్​కు వెళ్లటానికి ఎండ వల్ల ఇబ్బందిగా మారింది. పదేపదే దప్పిక వేయటంతో శీతల పానీయాలు తాగాల్సి వస్తోంది. ఎండ వేడికి చర్మం మంట పుడుతోంది. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది." -స్థానికుడు

"విజయవాడలో వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎండలకు తట్టుకోలేమనే అనిపిస్తోంది. వృద్ధులు ఈ ఎండ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి." -స్థానికుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.