గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల.. మెయిన్స్​ ఎప్పుడంటే..

author img

By

Published : Jan 27, 2023, 9:49 PM IST

Updated : Jan 27, 2023, 10:47 PM IST

appsc

21:44 January 27

ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలు

ఏపీపీఎస్సీ గ్రూప్​ వన్​ మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​
ఏపీపీఎస్సీ గ్రూప్​ వన్​ మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​

Group 1 Prelims Exam : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను శుక్రవారం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​ను ఏపీపీఎస్సీ విడుదల చేయగా.. ఏప్రిల్​ 23 నుంచి 29వరకు మెయిన్స్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకోసం ఎపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షను జనవరి 8వ తేదీన నిర్వహించింది. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించారు. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు లక్ష 26 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 75 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated :Jan 27, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.