ETV Bharat / state

సీపీఎస్​పై చర్చలకు ప్రభుత్వం పిలుపు.. ఈసారి పెట్టే మెలికపై ఆందోళనలో ఉద్యోగ సంఘాలు

author img

By

Published : Dec 5, 2022, 9:09 PM IST

Updated : Dec 6, 2022, 7:26 AM IST

CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలకు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది.

CPS Meeting
సీపీఎస్ మీటింగ్

CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది. సీపీఎస్​పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సీపీఎస్ అంశంపై మాత్రమే చర్చించేందుకు రావాలని ఆర్ధిక శాఖ ఆ నోట్​లో పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఏ మెలిక పెడుతుందోనని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.