ఈ చిలకమ్మకు రెక్కలు తొడిగితే.. అద్భుతాలే..!

author img

By

Published : Mar 8, 2023, 3:00 PM IST

Women's day special

Women's day special story: పుట్టుకతోనే ఆమెకు కాళ్లు, చేతులు లేవు. చదువుకుందామంటే పాఠశాలలో అడ్మిషన్‌ ఇవ్వలేదు. అయినా ఆ యువతి మనోధైర్యం కొల్పోలేదు. చదువుపై ఆసక్తితో ప్రైవేటుగా 10వ తరగతి పూర్తి చేసింది. మెహందీ పెడుతూ... కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న విజయవాడ దివ్యాంగురాలు చిలకమ్మపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

మెహందీ పెడుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న చిలకమ్మ

ETV Bharat Women's day special: పుట్టకతోనే కాళ్లు, చేతులు లేవు.. చదువుకుందామంటే ఎవరు పాఠశాలోకి రానివ్వలేదు. అయినా మనోధైర్యం కొల్పోలేదు... చదువుపై ఉన్న మక్కువతో ప్రైవేట్​గా పదో తరగతి పూర్తి చేసి ఇతరులపై ఆధారపడకుండా.. మెహందీ పెడతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు విజయవాడలోని దివ్యాంగ యువతి... అన్ని తామై ముందుకు నడిపిస్తున్న తోడపుట్టిన వారు ఉన్నా.. ఆత్మస్థైర్యంతో జీవిస్తోంది. తనకు ప్రభుత్వం స్పందించి ఉద్యోగం కల్పించాలని కోరుతున్న యువతిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యాన్ని సైతం అధిగమించవచ్చని ఈ యువతి నిరూపిస్తున్నారు. విజయవాడలోని కేదారేశ్వరిపేట, ఖుద్దూస్‌ నగర్‌కు చెందిన ప్రభుదాస్‌ దంపతులకు ఐదో సంతానంగా పుట్టిన చిలకమ్మ పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఏ పాఠశాలలోనూ ఆమెకు చదువుకునే అవకాశం లభించలేదు. నెలవారీ పింఛన్ ఆధారంగా చిలకమ్మ జీవనం సాగిస్తున్నారు. చదువుపై మక్కువతో తల్లితో పాటు తోబుట్టువుల సహకారంతో పింఛన్ డబ్బు పొదుపు చేసుకుని ప్రైవేటుగా పదో తరగతి పూర్తి చేశారు. ఏడాది క్రితం ఆమె తల్లి మరణించగా... ప్రస్తుతం ఆమె అక్కలే చిలకమ్మ బాధ్యతలను చూసుకుంటున్నారు. సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు చిలకమ్మ.

'అమ్మ ఉన్న రోజుల్లో ఇంటి వద్ద హోటల్ నడిపేవారు. అప్పుడు ఆర్దికంగా ఇబ్బందులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు అమ్మ లేకపోవడంతో ఆర్థిక కష్టాలు పడాల్సి వస్తోంది. చిలకమ్మ ఇంట్లో అన్ని పనులు చేస్తుందని, ఇల్లు ఉడవడం, బొమ్మలు వేయడం, మెహంది పెట్టడం, అంట్లు తోమడం మెదలైన పనులు అన్ని చాలా చక్కగా చేస్తుంది. చిన్నప్పుడు పాఠశాల్లో ఎవరు సీటు ఇవ్వకపోతే ఇంటి వద్దే ఉండి పదో తరగతి పూర్తి చేసింది. తనకు ఇంటర్ చదవాలని బాగా ఆశగా ఉందని.. ఫీజులు కట్టే పరిస్థితి మా వద్ద లేదు. చిలకమ్మకు వస్తున్న రూ.3 వేల పెన్షన్ సరిపోవడం లేదు. తాము వివాహలు చేసుకుని తమ కుటుంబంతో ఉంటున్నాం. భవిష్యత్​లో చిలకమ్మ బాగోగులు చూడటం కష్టంగా మారుతుంది. ప్రభుత్వం స్పందించి చిలకమ్మకు ఒక దారి చూపించాలి.'- కవిత, చిలకమ్మ సొదరి

ఇటీవల నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో ఓ స్టాల్‌లో చిలకమ్మ మెహందీ పెట్టడాన్ని గుర్తించిన రైల్వేశాఖ సిబ్బంది ప్రసాద్‌... వాసవీ క్లబ్‌ను సంప్రదించి ఆమెకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. చిలకమ్మకు వీల్‌ ఛైర్‌ అందించేందుకు క్లబ్‌ సభ్యులు ముందుకొచ్చారు. రోజువారీ కూలీతో కుటుంబాన్ని పొషిస్తున్నానని చిలకమ్మ తండ్రి ప్రభుదాస్‌ చెబుతున్నారు. నలుగురు కుమార్తెల వివాహాలు అయిపోయి వేరుగా ఉంటున్నారన్నారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి తన కుమార్తెకు జీవనోపాధి కల్పించాలని ఆయన కోరుతున్నారు. పుట్టుకతో కాళ్లు చేతులు లేకపోయినా ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటున్న చిలకమ్మ నేటి సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చిలకమ్మకు ఉద్యోగం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.