ETV Bharat / state

విశాఖ ఉక్కును కాపాడుకోకుంటే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు: సీపీఐ రామకృష్ణ

author img

By

Published : Apr 10, 2023, 7:49 PM IST

Updated : Apr 11, 2023, 6:50 AM IST

CPI Ramakrishna Visakha steel: విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే సీఎం జగన్‌కు ఆత్మహత్యే శరణ్యమని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. బిడ్డింగ్‌లో చిన్న రాష్ట్రం తెలంగాణ పాల్గొంటే జగన్ ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటుందని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును కాపాడుకోకుంటే జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని తెలిపారు.

CPI Ramakrishna Visakha steel
సీపీఐ రామకృష్ణ

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌ పై సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న నిరసనలు, రీలే దీక్షలు పోరాటాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం కదిలించలేకపోయాయనే చెప్పాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చర్యలు చేపడుతామంటూ ప్రకటించడం రెండు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మెుదలయ్యాయి. సొంత రాష్ట్రంలో అధికారపార్టీ చేయాల్సిన పనిని పక్క రాష్ట్రం చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శించడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో సీపీఐ రామకృష్ణ స్పందించారు.

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటే సీఎం జగన్‌కు ఆత్మహత్యే శరణ్యమని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. బిడ్డింగ్‌లో చిన్న రాష్ట్రం తెలంగాణ పాల్గొంటే జగన్ ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొంటుందని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును కాపాడుకోకుంటే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెలిపారు. తెలంగాణ బిడ్డింగ్‌లో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్‌కు అవమానమన్నారు. జగన్‌కు ధైర్యముంటే మోదీ దగ్గరకు వెళ్లి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అపాలని రామకృష్ణ పేర్కొన్నారు. లేదంటే సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందరో బలిదానాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని రామకృష్ణ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా అమ్మాలని చూస్తోందని రామకృష్ణ అగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, జగన్ కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమను అదానికీ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రధానమంత్రి మోదీ వద్దకు వెళ్లి విశాఖ ఉక్కు వేలాన్ని ఆపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

' ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పరంచేయాలని చూస్తున్నారు. అందు కోసం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. నరేంద్ర మోదీ, జగన్ కలిసి విశాఖ ఉక్కును అదానికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు కోసం బిడ్డింగ్ వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిశీలించడానికి కేసీఆర్ తన బృందాన్ని పంపిస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం చిన్న రాష్ట్రమైన తెలంగాణ బిడ్డింగ్ వేస్తే ఇక జగన్​కు ఆత్మహత్యే శరణ్యం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటికైనా జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా చూడాలి.'- రామకృష్ణ, సీపీఐ నేత

ఇవీ చదవండి:

Last Updated : Apr 11, 2023, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.