ETV Bharat / state

టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి.. లేదంటే ఐక్య ఉద్యమమే:రామకృష్ణ

author img

By

Published : Apr 5, 2023, 6:48 PM IST

CPI State Secretary Ramakrishna
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Round Table Meeting : టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో నిర్మించారని లబ్ధిదారులకు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరించడం సరి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి.. లేదంటే ఐక్య ఉద్యమమే:రామకృష్ణ

Round Table Meeting : టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వం లబ్దిదారులకు ఇళ్లను కేటాయించే వరకు ఐక్య ఉద్యమం చేపట్టాలని తీర్మానం చేశారు. టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో నిర్మించారని కక్షపూరితంగా వ్యవహరించడం సరి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు.

జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకోవాలని లబ్దిదారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సెంటు భూమిలో ఎలా ఇల్లు నిర్మించుకుంటారని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా టిడ్కో ఇళ్లలోకి లబ్ధిదారులను వెళ్లకుండా అడ్డు పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులలో ఉండి జైలుకు వెళ్లి వచ్చిన జగన్​ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ పాత్రికేయులను మాత్రం అర్హతలు, వారిపై కేసులు ఉంటే సమాచార శాఖ వచ్చే ఆక్రెడిటేషన్ గుర్తింపు కార్డులు మంజూరు చేయరన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎండ గడుతున్నందుకు ఈనాడు యాజమాన్యం రామోజీరావుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది సరి కాదన్నారు.

" జగనన్న కాలనీల విషయంలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మొన్ననే ఉండవల్లి శ్రీ దేవి చెప్పింది. అందులో మీరు, మీ ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు దోచుకున్నారు. వారికి ఇచ్చేటప్పుడు సెంటు భూమి ఇచ్చారు. రెండు మూడు సెంట్లు ఇవ్వండని ఆరోజే చెప్పాము. వారికి ఉపయోగపడుతుందని, పైగా రిసోర్స్ పర్సన్స్ ద్వారా వాళ్లను బెదిరిస్తా ఉన్నారు. లక్ష ఎనభై వేలలో కట్టుకోండి మేము అప్పు ఇస్తాము.

35 వేల రూపాయలు అప్పు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది సరైనదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇసుక, సిమెంట్, స్టీల్ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో 6,7 లక్షల రూపాయలు ఉంటే తప్ప కట్టుకోలేరు. కాబట్టి ఇసుక, సిమెంట్ ఇచ్చి ప్రతి లబ్ధి దారుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తా ఉన్నాము. " - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

" ఇవాళ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే బ్యాంకులో ఒకొక్క ఇంటి మీద 2 లక్షల 23 వేల రూపాయలు లోన్ తీసుకున్నది. లోన్​ తీసుకోవడంలో ఉన్న శ్రద్ద, ఇళ్ల నిర్మాణంపై లేదు. తీసుకున్న లోన్ నుంచి 20, 30 వేలు ఖర్చు పెట్టిన ఆ ఇళ్లు పూర్తి అయ్యేవి. " - గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.