ETV Bharat / state

అధికారంలోకి రాకముందు డాంబికాలు - నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని పెంచని వైసీపీ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 7:23 AM IST

CM_Jagan_Cheating_Farmers
CM_Jagan_Cheating_Farmers

CM Jagan Cheating Farmers: వైఎస్సార్సీపీది రైతు సంక్షేమ సర్కారు అని పదేపదే ఊదరగొట్టే సీఎం జగన్‌.. వారికి సాయం అందించడంలో మాత్రం రిక్తహస్తమే చూపుతున్నారు. పంట నష్టపోయిన రైతులకిచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు ఆయనకు చేతులు రావడం లేదు. పరిహారం లెక్కింపులోనూ 9 ఏళ్ల నాటి లెక్కల్నే ప్రామాణికంగా తీసుకుంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి రాకముందు డాంబికాలు- విపత్తుల్లో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని పెంచని వైసీపీ ప్రభుత్వం

CM Jagan Cheating Farmers : నాలుగున్నరేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు సీఎం జగన్‌(CM Jagan)కు చేతులు రావడం లేదు. తిత్లీ తుపాను (Titli Cyclone) సమయంలో దెబ్బతిన్న అరటి, జీడిమామిడి, మామిడి తోటలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం (TDP Government)ఎకరాకు 12వేల చొప్పున పెట్టుబడి రాయితీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎకరాకు 9 వేలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఈమొత్తాన్నీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే.

Farmers Problems in YSRCP Government : కొబ్బరి చెట్టుకు 1,500 చొప్పున సాయం అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే.. కాదు మేం అధికారంలోకి వచ్చాక 3వేలు, జీడిమామిడికి ఎకరాకు 20 వేలు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా 2019లో ఉత్తర్వులు సైతం ఇచ్చారు. కానీ ఈ ఏడాది నవంబరు 14న జారీ చేసిన ఉత్తర్వుల్లో కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారంలో పూర్తిగా కోత విధించారు. చెట్టుకు 1,000, జీడిమామిడికి ఎకరాకు 9 వేలే పరిహారంగా నిర్ణయించారు.

మాయదారి రోగం - లబోదిబోమంటున్న మిర్చి రైతులు

YSRCP Government Not Increasing Investment Subsidy For Farmers : రైతులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో తేడా కనిపిస్తోంది. విపత్తు నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉండటంతో దాన్ని పెంచాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు (Ex CM Chandrababu) ఆదేశించారు. హుద్‌హుద్‌ తుపాను (Hudhud Cyclone) సమయంలోనే తన నిర్ణయాన్ని అమలు చేశారు. 2018 తిత్లీ సమయంలో మరింత ఉదారత ప్రదర్శించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాటిని పెంచలేదు సరికదా.. మరింత తగ్గించింది. తిత్లీ సమయంలో ఎకరా వరికి 8వేల పెట్టుబడి సాయమిస్తే.. వైసీపీ మాత్రం ఎకరాకు 6 వేల 800 మాత్రమే ఇస్తామంటోంది. 2018 తిత్లీ తుపాను సమయంలో వరికి ఎకరాకు 8 వేలు అందించారు. అరటి, జీడిమామిడి, మామిడి, కొబ్బరి చెట్లకు సాయాన్నీ పెంచారు. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం కోత పెట్టింది.

సాయంలో కోత : విపత్తు సమయంలో ఎవరైనా చనిపోతే 2014 నాటి కేంద్ర నిబంధనల ప్రకారం లక్షన్నర పరిహారం ఇవ్వాలి. దాన్ని టీడీపీ ప్రభుత్వం 5లక్షలకు పెంచింది. ఇప్పుడు కేంద్రమే సాయాన్ని 4 లక్షలకు పెంచినా రాష్ట్రం తనవంతుగా పైసా కలపడం లేదు. కళ్లు, ఇతర అవయవాలు దెబ్బతింటే 43,500 రూపాయలు ఇవ్వాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించగా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం లక్షకు పెంచింది. తాజాగా కేంద్రం దాన్ని 74వేలకు పెంచగా.. రాష్ట్రం దాన్నే అమలు చేయనుంది. అంటే సాయంలో 26 వేలు కోత పెట్టారు. తోపుడు బండ్లు, ఆటోరిక్షాలకు 2014లోనే 5వేల చొప్పున సాయం ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాతా దీన్ని పెంచలేదు.

పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?

పంటనష్టం 33 శాతానికి పైగా ఉంటేనే పెట్టుబడి రాయితీ ఇవ్వాలనే విపత్తు నిబంధననే ఇప్పటికీ వైసీపీ సర్కారు వల్లె వేస్తోంది. 33 శాతం నష్టమంటే ధాన్యం దిగుబడి ఎకరానికి 30 బస్తాలు అనుకుంటే 10 బస్తాల నష్టాన్ని పరిగణనలోకి తీసుకోరు. బస్తా 2 వేల లెక్కన రైతు 20వేలు నష్టపోయినా పట్టించుకోరు. మిరప ఎకరానికి 20 క్వింటాళ్లు వస్తే.. ఆరు క్వింటాళ్ల పంట దెబ్బతిన్నా లెక్కల్లోకి తీసుకోరు. ఇప్పటి ధరల ప్రకారం అది లక్షా 20 వేల పైమాటే. ప్రభుత్వమిచ్చేది ఎకరానికి 6 వేల 8 వందలే. మామిడి, ఇతర పండ్ల తోటలు ఏవైనా వేళ్లతో సహా విరిగిపడితేనే పంట నష్టం లెక్కల్లోకి తీసుకుంటారు. కాయలన్నీ రాలినా పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న పంట సగానికి విరిగితే పరిహారం ఇవ్వరు. వేళ్లతో సహా నేలమట్టమైతేనే పెట్టుబడి సాయం అందిస్తారు. ఇలాంటి నిబంధనలతోనే రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది.

సున్నా వడ్డీ పథకం పేరుతో మోసం - దిక్కుతోచని స్థితిలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.