ETV Bharat / state

అవినాష్​ను ప్రశ్నించిన మహిళ సోదరి మృతి..కేసులు పెట్టడంతోనే గుండెపోటన్న బాధితులు

author img

By

Published : Feb 14, 2023, 7:41 PM IST

Choti dide
చోటి మృతి

Choti family alleges on ycp: విజయవాడ కృష్ణలంకలో ఇటీవల వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను ప్రశ్నించిన కుటుంబంలోని ఓ మహిళ గుండెపోటుతో చనిపోయారు. దేవినేని అవినాస్‌ అనుచరుల బెదిరింపులతోనే.. ఆమె మానసిక ఆందోళన గురై చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. అవినాష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుపై బాధితురాలైన రమీజాతో పాటు 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అధికారులు వచ్చి వివరాలు సేకరించిన కొద్దిసేపటికే చోటి మృతి చెందిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Choti died because of YCP leaders: విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన చోటి గుండెపోటుతో మృతి చెందింది. దేవినేని అవినాస్‌ అనుచరుల బెదిరింపులతోనే ఆమె మానసిక ఆందోళన గురై చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల దేవినేని అవినాష్ అనుచరులు కృష్ణలంకలో రమీజా కుటుంబంపై దాడి చేసిన విషయం తెలిసిందే. వైసీపీ పాలనతో విసిగిపోయామని ఇంటికి టీడీపీ జెండా కట్టుకున్నందుకు రమీజాపై గత నెల 10వ తేదీన అవినాష్ అనుచరుల దాడి చేసిన ఘటన సంచలనమైంది. రమీజా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు, అవినాష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుపై బాధితురాలైన రమీజాతోపాటుగా మరో 17మందిపై కేసు నమోదు చేశారు.

ఆ కేసులో బలవంతంగా చోటి పేరు: 10వ తేదీన రమీజా సోదరి చోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. సంబంధం లేని కేసులో బలవంతంగా చోటి పేరు చేర్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిన్న అధికారులు వచ్చి వివరాలు సేకరించిన కాసేపటికే చోటి మృతి చెందిందన్నారు. చోటి కుటుంబ సభ్యులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నేతలు పరామర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా... ఇంకెంత మంది చనిపోవాలని గద్దెరామ్మోహన్‌ ప్రశ్నించారు. స్వార్ధ రాజకీయాలు కోసం పార్టీలు మారే అవినాష్ పోయిన ప్రాణాలు తీసుకురాగలడా అంటూ మండిపడ్డారు. ప్రశాంతమైన తూర్పు నియోజకవర్గాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారని గద్దెరామ్మోహన్‌ దుయ్యబట్టారు.

అసలేం జరిగిందంటే: విజయవాడలోని రాణిగారితోటలో 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో తారక రామా నగర్లో ఎస్కే రమీజా అనే మహిళ ఇంటివద్ద ఆగారు. ఒంటరి మహిళ పింఛను కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఇంటిపై టీడీపీ జెండాను చూస్తూ.. "ఇది మనం పెట్టిందేనా' అని దేవినేని అవినాష్ అడిగారు. 'ఔను! ఎందుకు పెట్టామో తెలుసా మమ్మల్ని ఆయన మోసం చేశారు' అంటూ కార్పొరేటర్ రామిరెడ్డిని చూపిస్తూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు గుడివాడలో తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు ఆ జెండాను పెట్టాం' అని మరో మహిళ చెప్పడంతో గొడవ చోటు చేసుకుంది. ఇది మనసులో పెట్టుకున్న వైకాపా మహిళా కార్యకర్తలు 20 మంది మంగళవారం ఉదయం రమీజా ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారు.

దేవినేని అవినాష్‌ను ప్రశ్నించిన కుటుంబంలోని ఓ మహిళ మృతి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.