ETV Bharat / state

ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం చేయించిన సీజే

author img

By

Published : Jan 27, 2023, 12:45 PM IST

Judges Oath: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్‌ పి.వెంకట జ్యోతిర్మయి, జస్టిస్‌ వి.గోపాల కృష్ణారావు ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు.

Judges oath
న్యాయమూర్తుల ప్రమాణం

Judges Oath: హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. కోర్టు ప్రారంభం కంటే ముందు మొదటి కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టులో 30 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. నూతన న్యాయమూర్తుల రాకతో హైకోర్టులో మొత్తం 32 మంది న్యాయమూర్తులవుతారు. ఈనెల 10వ తేదీన వీరి పేర్లను కొలిజీయం సిఫార్సు చేయగా తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.