ETV Bharat / state

2024 ఎన్నికల తర్వాత జగన్​ జైలుకి.. వైకాపా బంగాళాఖాతానికి: చంద్రబాబు

author img

By

Published : Nov 3, 2022, 3:53 PM IST

Updated : Nov 3, 2022, 9:35 PM IST

CBN FIRES ON CID
CBN FIRES ON CID

CBN FIRES ON CID : జలవనరులశాఖ ఈఈని బెదిరించి అయ్యన్న కుటుంబ సభ్యులపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చి.. ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వెనక్కి తీసుకున్న విధంగానే.. జలవనరులశాఖ అధికారి మల్లిఖార్జున రావుతో అయ్యన్న కుటుంబంపై ఫిర్యాదు ఇప్పించారని దుయ్యబట్టారు. అయ్యన్నపాత్రుడు తాత నుంచీ ఆ కుటుంబానికి మచ్చ లేని 60 ఏళ్ల రాజకీయాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. భూ దోపిడీ కుటంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు.

CBN FIRES ON POLICE OVER AYYANNA ARREST : తెదేపా నేత అయ్యన్నపాత్రుడి అక్రమ అరెస్ట్​ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. వైకాపా అరాచక పాలనకు పరాకాష్టే.. అయ్యన్న అరెస్టు అని ధ్వజమెత్తారు.

భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌ది: జలవనరుల శాఖ ఈఈని బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ఆగ్రహించారు. వివేకా హత్యకేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చారని.. ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారన్న బాబు.. జలవనరుల శాఖ అధికారి అయ్యన్నపై ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇలాంటిదేనని పేర్కొన్నారు. అయ్యన్న తాత నుంచి ఆ కుటుంబానికి మచ్చలేని 60 ఏళ్ల రాజకీయాల చరిత్ర ఉందన్న బాబు.. భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌దని విమర్శించారు. ఇడుపులపాయలో వందల ఎకరాలు వైఎస్ కుటుంబం ఆక్రమించుకుందని.. హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా చేసి.. వైఎస్ సీఎం అయ్యాక క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపించారు. జగన్ మేనమామ వాగు ఆక్రమించి థియేటర్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేశారని మండిపడ్డారు.

ఆ కుటుంబ అక్రమాలపై చర్యలు తీసుకుంటారా?: వైఎస్ కుటుంబ అక్రమాలపై ఫిర్యాదు చేస్తాం.. చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. హత్య చేసిన అవినాష్‌కు అభయం ఇస్తున్నారు కానీ.. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కుతారా? అని నిలదీశారు. పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కొంతమంది కళంకిత అధికారులు తప్పుడు విధానాలతో వెళ్తున్నారని.. వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

వారికి టికెట్​ ఇవ్వడం ఇష్టం లేకే ఘోరాలు : అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మేం తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే లక్షలమందిపై పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. వివేకా హత్యకేసులో షర్మిల సంచలనం వాంగ్మూలం ఇచ్చిందన్న బాబు.. అయిన చర్యల్లేవని మండిపడ్డారు. కడప ఎంపీ టికెట్‌ విషయంలో వివాదాలు ఉన్నాయని షర్మిల చెప్పారని బాబు అన్నారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చంపించారనే సమాచారం ఉందని షర్మిల చెప్పిందని పేర్కొన్నారు. చెల్లెలు, తల్లికి టికెట్‌ ఇవ్వడం ఇష్టం లేకే ఘోరాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చే సమయంలో బెదిరించారా? లేదా? అని నిలదీశారు.

సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీసుగా : తప్పుడు పనులు చేయడంలో జగన్‌కు అవార్డు ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. బెదిరించి బ్లాక్‌మెయిల్‌ చేసి కేసు పెట్టిస్తారా? అని మండిపడ్డారు. తప్పుడు పనులు చేయడానికే జగన్‌ సీఎం పదవిలో ఉన్నారా అని నిలదీశారు. సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీసుగా మారిందని పేర్కొన్నారు. శారీరకంగా హింసిస్తారేమో కానీ.. మానసికంగా మేం బలంగా ఉన్నామన్నారు. కోర్టులు చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. మాపై కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల చరిత్ర ఏంటి? అని ప్రశ్నించారు.

2024 ఎన్నికల తర్వాత జగన్​ జైలుకి.. వైకాపా బంగాళాఖాతానికి

ఇవీ చదవండి:

Last Updated :Nov 3, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.