తెలుగుదేశం ఏర్పాటుతోనే వారి జీవితాల్లో పెనుమార్పులు: చంద్రబాబు

author img

By

Published : Jan 9, 2023, 3:22 PM IST

CBN ON NTR AS CHIEF MINISTER

CHANDRABABU ON NTR AS CHIEF MINISTER: తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగువారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ప్రయాణాన్ని..1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం ముందు.. ఆవిర్భావం తరువాత అని చూడాల్సిన అవసరం ఉందన్నారు.

CBN ON NTR AS CHIEF MINISTER : స్వర్గీయ నందమూరి తారక రామారావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. తెలుగు జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీర్తించారు. తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగు వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.

పేదరికం లేని సమాజం కోసం టీడీపీ ఆవిర్భావం: తెలుగు జాతి ప్రయాణాన్ని..1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలు చూసిన ఎన్టీఆర్​.. పేదరికం లేని సమాజం కోసం పార్టీ పెట్టి.. 9 నెలల్లో అధికారం చేపట్టారని స్పష్టం చేశారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ ప్రమాణం స్వీకారం చేసి... తెలుగు ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు నాంది పలికారని వెల్లడించారు.

విప్లవాత్మకమైన కార్యక్రమాల ఘనత టీడీపీకే సాధ్యం: రెండు రూపాయలకు కిలో బియ్యం, భూమి శిస్తు రద్దు, సింగిల్ విండో విధానం, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, 50 రూపాయలకే రైతులకు హార్స్ పవర్ విద్యుత్, మహిళలకు ఆస్తి హక్కు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు పింఛన్లు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ, విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ, మహిళల కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని అన్నారు.

బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే: రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కింది టీడీపీ ఆవిర్భావంతోనే అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. నాటి ప్రభుత్వం, పాలనలో బీసీలకు ప్రాధాన్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదలకు నాంది పలికిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్​ల ఏర్పాటుతో వారి జీవితాల్లో వెలుగు తెచ్చిందని తెలిపారు.

గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్​లు ఏర్పాటు చేయడం ద్వారా అణగారిన వర్గాలకు విద్యను చేరువ చేసిందని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీగా టీడీపీ ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

ప్రజల వద్దకే పాలన కార్యక్రమంతో జవాబుదారీతనం: ఎన్టీఆర్ తెలుగు వారికి ఆత్మగౌరవం తెచ్చిపెడితే.. తాను వారిలో ఆత్మవిశ్వాసం పెంచినట్లు తెలిపారు. ఆ తరువాత కాలంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలనలో సంస్కరణలు తీసుకువచ్చానని తెలిపారు. ప్రజల వద్దకే పాలన వంటి కార్యక్రమాలతో నాయకుల పాలనలో జవాబుదారీతనం తీసుకువచ్చామని.. పాలకులు అంటే సేవకులు అనే నినాదంతో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసినట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐటీ, ఫార్మా, సేవల రంగంలో సంస్కరణలు అమలు చేసి ఆ ఫలితాలను పేద, సామాన్య కుటుంబాలకు అందేలా చేశామన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యధిక ప్రతిభ కలిగిన వారిలో తెలుగు ప్రజలు ముందు వరసలో నిలిచారని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం: ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం నిత్యం కలలు కని.. వాటిని సాకారం చేసిన ఏకైక ప్రభుత్వంగా తెలుగుదేశం నిలిచిపోతుంది అని చంద్రబాబు అన్నారు. టీడీపీ తొలి ప్రభుత్వం ఏర్పడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్​ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైకో పాలకుల చేతిలో సర్వ నాశనం అవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటంలో టీడీపీ ముందు ఉంటుందని వెల్లడించారు. ఎన్టీఆర్ కలలుగన్న పేదరికం లేని సమాజం నిర్మించేందుకు, ఆయన ఆశయ సాధన దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు.

  • తెలుగు గడ్డపై కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు...తెలుగు వెలుగులు విరజిమ్మిన రోజు... ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి పరిచయం అయిన రోజు... బడుగులకు రాజ్యాధికారం దక్కిన రోజు.... ప్రతి తెలుగువాడు గర్వించిన రోజు... అదే, 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం తొలి ప్రభుత్వం ఏర్పడిన ఈరోజు.#NTRLivesOn pic.twitter.com/os7zmigcZ4

    — N Chandrababu Naidu (@ncbn) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.