ETV Bharat / state

పిచ్చోడి చేతిలో రాయిలా.. ఆంధ్రప్రదేశ్‌లో పాలన: రేణుకా చౌదరి

author img

By

Published : Mar 1, 2023, 5:26 PM IST

Updated : Mar 1, 2023, 5:49 PM IST

Congress party senior leader Renuka Chaudhary fire on CM Jagan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో తాను ఎక్కడైనా, ఎప్పుడైనా పర్యటిస్తానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ అమె సవాల్ విసిరారు.

Renuka Chaudhary f
Renuka Chaudhary

Renuka Chaudhary fire on CM Jagan: ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ ఉంది?.. అమరావతి రైతులు ఎంతో క్రమశిక్షణగా, ఎన్నో రోజుల నుంచి నిరసన తెలుపుతున్నప్పటికీ.. కనికరించేలేని కఠిన మనస్సు ఉన్న జగన్‌కు.. రాజకీయాలు ఏం తెలుసు? రౌడీయిజంతో అందరిపైనా దాడులు చేస్తూ.. రాష్ట్రంలో ప్రగతి అనేదే కనిపించని పరిస్థితిలో ఇవాళ ప్రజలను వేధిస్తూ.. పేదలను వెక్కిరించేలా రోజుకో పథకం అంటున్నారే తప్ప.. అభివృద్ది మాత్రం ఒక్కటి లేదు.. బంగారంలాంటి రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు'' అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ పర్యటనకు విచ్చేసిన ఆమెకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకగా.. కొద్దిసేపు ఆమె రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మహిళలు, రైతులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలియజేసినా వారికి న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆమె దుయ్యబట్టారు. ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని.. సీఎం జగన్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

పిచ్చోడి చేతిలో రాయిలా.. ఆంధ్రప్రదేశ్‌లో పాలన

అనంతరం తనను రాష్ట్రానికి రావాలని ప్రజలు పదేపదే కోరుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించి.. వారి నిర్ణయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి వెల్లడించారు. జగన్ పరిపాలనలో రోజురోజుకు నరకం అనుభవిస్తోన్న ప్రజలు.. తమను ఈ పాలన నుంచి విముక్తి కల్పించాలని కోరుటుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాలకు లెక్కచేయని సీఎం జగన్‌ మాటలను.. సామాన్యులు ఎందుకు అతని మాటలు వినాలని ఆమె ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని తిరస్కరణ ఓటుతో ఓడించాలని ప్రజలను ఆమె కోరారు.

తాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా, ఎప్పుడైనా పర్యటిస్తానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ రేణుకా చౌదరి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుతో ఉన్న పార్టీని దేశం పేరుగా మార్చి 'తెలంగాణ' పేరునే లేకుండా చేశారని.. అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అనేది పెద్ద ఉమ్మడి కుటుంబమని.. ఎక్కడో ఓ చోట బేధాభిప్రాయాలు ఉంటాయే తప్ప, ఇతర పార్టీల్లో మాదిరి కాదని ఆమె స్పష్టతనిచ్చారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 1, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.