ETV Bharat / state

పోలీసులకు పట్టిస్తారా..! బ్లేడ్ బ్యాచ్‌ల ఆధిపత్యపోరుతో బెంబేలెత్తిన స్థానికులు

author img

By

Published : Mar 3, 2023, 8:45 PM IST

Updated : Mar 3, 2023, 9:06 PM IST

Blade Batch Veeranga in Vijayawada Chittanagar: విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బ్లేడ్ బ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. తమ బ్యాచ్ సభ్యులను పోలీసులకు అప్పగిస్తారా అంటూ.. ఆంజనేయ వాల్ సెంటర్ కొండ ప్రాంతానికి చెందిన అఖిల్ మరో ఆరుగురు యువకులు బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడారు. దాడిలో అఖిల్, శీను అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమయంలో కాలనీవాసులు, వాహనాదారులు భయంతో బెంబేలెత్తిపోయారు.

Blade Batch
Blade Batch

Blade Batch Veeranga in Vijayawada Chittanagar: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు రెండు గంజాయి బ్యాచ్‌ల మధ్య భయంకరమైన వార్ జరిగింది. చుట్టుప్రక్కల స్థానికులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా.. ఒకరిపై మరోకరు పిడి గుద్దులకు పాల్పడుతూ.. బ్లేడ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడున్న కాలనీ ప్రజలు, వాహనదారులు, స్కూల్ విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడిలో ఇద్దరు కత్తిపోట్లకు గురికాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని చిట్టినగర్‌ ప్రాంతంలో నేడు బ్లేడ్ బ్యాచ్‌లు వీరంగం సృష్టించాయి. గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకి ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండి గలాటా చేస్తున్న గని బ్యాచ్ సభ్యులను పట్టుకొని.. హరి బ్యాచ్ సభ్యులు పోలీసులకు అప్పగించారు.

ఈ క్రమంలో తమ గ్రూప్ సభ్యులను హరి బ్యాచ్‌కు చెందిన సభ్యులు.. పోలీసులకు అప్పగించారన్న కక్షతో గని బ్యాచ్ సభ్యులు ఈరోజు హరి బ్యాచ్ సభ్యులపై తీవ్రంగా దాడులు చేశారు. ఆంజనేయ వాల్ సెంటర్ కొండ ప్రాంతంలో గని బ్యాచ్ సభ్యుడైన అఖిల్ మరో ఆరుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకొని.. బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. బ్లేడ్ల దాడిలో అఖిల్, శీను అనే ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ బహిరంగంగా జరగడంతో అక్కడున్న స్థానికులు, కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు బ్యాచ్‌లు దాడి చేసుకుంటుండగా పలువురు వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఒకరిపై ఒకరు పిడి గుద్దులకు పాల్పడుతూ.. బ్లేడ్లతో దాడులు చేసుకోవటంతో పరుగులు తీశారు.

అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు దాడి సమాచారాన్ని చేరవేయడంతో.. హూటాహూటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడి జరిగిన సమయంలో అక్కడ దొరికిన బ్లేడ్లలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాడి జరిగిన విధానం, దాడికి పాల్పడిన యువకులను అక్కడ రికార్డ్ అయిన సీసీ ఫోటోల ఆధారంగా పరిశీలించారు. సీసీ ఫోటోల్లో ఉన్న ప్రకారం.. ''రెండు ద్విచక్ర వాహనాలపై యువకులు విచ్చేశారు. ఓ దుకాణం ముందు కూర్చోని ఉన్న వ్యక్తి వద్దకు వచ్చి ఒక్కసారిగా దాడి చేయటం మొదలుపెట్టారు. దాడి తీవ్రమైన క్రమంలో పిడి గుద్దులకు పాల్పడుతూ.. బ్లేడ్లతో దాడులు చేసుకున్నారు. దాడి అనంతరం ఓ యువకుడు రక్తపుమాడుగులో ఉండగా అతనిని పలువురు ఆటోలో ఆసుపత్రికి తరలించారు.'' గంజాయినీ సేవిస్తూ బహిరంగంగా రోడ్లపై దాడులు చేసుకున్న యువకులపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

విజయవాడ చిట్టినగర్‌లో బ్లేడ్ బ్యాచ్‌లు వీరంగం

ఇవీ చదవండి

'ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'

పుంగనూరుకు వస్తే గుర్తొచ్చేది.. పెద్దిరెడ్డి పాపాలు, ఆరాచకాలు: నారా లోకేశ్

ముగిసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు.. పాడె మోసిన చంద్రబాబు

Last Updated :Mar 3, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.