ETV Bharat / state

రాష్ట్రంలోని ఐటీ కంపెనీలను తరిమేయాలని చూస్తున్నారు: ఎంపీ జీవీఎల్‌

author img

By

Published : Dec 24, 2022, 4:32 PM IST

BJP MP GVL: ఐటీ రంగంలో ఉన్న కంపెనీలను తరిమేయాలనే ఆలోచన తప్ప.. కొత్త కంపెనీలను తీసుకురావాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. సీఎం తన పేరు జగన్‌,.. తాను ఇక్కడే ఉంటానంటూ కొత్త డైలాగ్‌ కొట్టారనీ.. అమరావతి విషయంలోనూ ఇదే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఇక్కడే ఉంటుందని అన్నారని... ఆ మాటకు కట్టబడి లేరని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.

BJP MP GVL
ఎంపీ జీవీఎల్‌

BJP MP GVL Narasimha Rao: ఐటీ రంగంలో ఉన్న కంపెనీలను తరిమేయాలనే ఆలోచన తప్ప.. కొత్త కంపెనీలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. ప్రోత్సాహకాలు ఇచ్చి కొత్త కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన యువత తమ ప్రతిభతో పది నుంచి 15 శాతం ఐటీ రంగాన్ని నిర్దేశిస్తుంటే.. ఐటీ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రం అత్యంత ఘోరమైన స్థితిలో ఉందని.. ఇదే విషయాన్ని తాను పార్లమెంటు వేదికగా జీరో అవర్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు. టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ గుర్తొస్తుందని.. లేదంటే హైదరాబాదేనని విమర్శించారు.

నిన్న సీఎం తన పేరు జగన్‌, తాను ఇక్కడే ఉంటానంటూ కొత్త డైలాగ్‌ కొట్టారనీ.. అమరావతి విషయంలోనూ ఇదే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఇక్కడే ఉంటుందని అన్నారని... ఆ మాటకు కట్టబడి లేరని ఎద్దేవా చేశారు. కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటారా? లిఖితపూర్వకంగా రాసి ఇస్తారా? అని ప్రశ్నించారు. 2024 మే తర్వాత వైకాపాకు అధికారం చేజారబోతుందని, అప్పుడు సైతం అమరావతిలోనే ఉంటారా? అనేది లిఖితపూర్వకంగా భరోసా ఇస్తారా? అని జీవీఎల్‌ అన్నారు. 12,500 కోట్ల రూపాయలతో బెంగళూరు-విజయవాడ ఆరులైన్ల రహదారి ఆమోదం పొందిందని, వచ్చే ఏడాది నిర్మాణం మొదలవుతుందని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్​ ఎకనామిక్‌ కారిడార్‌ పేరిట ఈ రహదారిని అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

'ఐటీ రంగం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాట 0.1 శాతం. రాష్ట్రానికి చెందిన యువత తమ ప్రతిభతో పది నుంచి 15 శాతం ఐటీ రంగాన్ని నిర్దేశిస్తుంటే... ఐటీ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రం అత్యంత ఘోరమైన స్థితిలో ఉంది.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి కొత్త కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎందుకు చేయడం లేదు. నిన్న సీఎం తన పేరు జగన్‌, తాను ఇక్కడే ఉంటానంటూ కొత్త డైలాగ్‌ కొట్టారు. అమరావతి విషయంలోనూ ఇదే చెప్పారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఇక్కడే ఉంటుందని అన్నారు. ఆ మాటకు కట్టబడి లేరు. కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటారా? లిఖితపూర్వకంగా రాసి ఇస్తారా?'- జీవీఎల్‌ నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.