ETV Bharat / state

Atchannaidu about CID Searches in Margadarsi: "మార్గదర్శిపై సీఎం జగన్​ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు"

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 7:07 PM IST

Updated : Aug 22, 2023, 7:39 PM IST

Atchannaidu Comments on CID Searches in Margadarsi: కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ సోదాలు చేయటంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పత్రిక ప్రకటన విడుదల చేశారు. కర్ణాటకలో 109వ బ్రాంచ్ ప్రారంభం మార్గదర్శి నిజాయతీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Atchannaidu Comments on CID Attacks on Margadarsi:
Atchannaidu Comments on CID Attacks on Margadarsi:

Atchannaidu Comments on CID Searches in Margadarsi : మార్గదర్శి సంస్థపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా జగన్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో 109వ బ్రాంచ్ ప్రారంభం మార్గదర్శి నిజాయితీకి నిదర్శనమని అన్నారు. ప్రజల అభిమానం పొందుతూ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న సంస్థను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మార్గదర్శి సంస్థ చందాదారుల నమ్మకం పొందిందని, మార్గదర్శి అంటే నమ్మకం, నిజాయతీ, పారదర్శకత అని తెలిపారు.

TDP Leader Atchannaidu Fires on CM Jagan Behaviour : మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెల్లడించే వరకు మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని.. మరోవైపు హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి రాత్రి వేళల్లో సీఐడీ సోదాలు (CID Searches in Margadarsi) నిర్వహిస్తుండటం జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు నిదర్శనమని అన్నారు. ఈ విషయంపై న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల విశ్వాసం, మన్ననలు పొందిన మార్గదర్శిని దెబ్బతీయలేరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సోదాలపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

High Court on Margadarsi Raids: "మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలి".. ఏపీ హైకోర్టు సూచన

జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చందాదారులను అడ్డుకోవడం, సిబ్బందిని వేధింపులకు గురి చేయడం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎలాంటి మచ్చ లేదని స్పష్టం చేశారు. చందాదారులు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోయినా సీఐడీ అధికారులే ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మార్గదర్శి సంస్థపై కక్షసాధింపు చర్యలు : మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి అండ్ కో అవినీతిని ''ఈనాడు'' పత్రికలో ఎండగడుతున్నందునే లొంగదీసుకునేందుకు మార్గదర్శిని ఎంచుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. ప్రశ్నిస్తున్న వారి నోరు నొక్కాలనే జగన్ రెడ్డి కుటిల పన్నాగాలు నెరవేరబోవని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మార్గదర్శి సంస్థపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

Telugu People With Ramoji Rao: 'తెలుగువారంతా రామోజీగారితోనే'... ట్విట్టర్​లో టాప్ ట్రెండింగ్.. ప్రభుత్వ వేధింపులపై ఆగ్రహం

కోర్టు తీర్పులను లెక్కచేయకుండా మార్గదర్శిలో సోదాలు : ముఖ్యమంత్రి పదవి వచ్చాక ప్రభుత్వ కట్టడాలను కూల్చివేతతో మొదలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి.. ప్రైవేట్ సెక్టార్​ను కూడా దెబ్బతీయాలని చూస్తున్నారని టీటీడీ నాయుకుడు నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడారు. ఇటీవల అమరరాజా జోలికి వెళ్లారని.. ఇప్పుడు 60 ఏళ్ల చరిత్రలో ఎలాంటి మచ్చ లేని మార్గదర్శి సంస్థపై ఎన్నో రకాలుగా దాడులు, తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కోర్టు తీర్పులను లెక్క చేయకుండా సీఐడీ సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా మార్గదర్శికి ఆదరణ ఉందని తెలిపారు. ప్రతి చందదారుడుకి మార్గదర్శిపై నమ్మకం ఉందిని.. తప్పుడు కేసులు పెట్టి మార్గదర్శి మేనేజర్​లను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శిని కాపాడుకోవడం తమ బాధ్యత అని తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేని దౌర్భాగ్యపు సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

AP CID Chief Sanjay on Margadarsi: మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని మేమే చెబుతున్నాం: సీఐడీ చీఫ్ సంజయ్

Last Updated : Aug 22, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.