ఏపీఎస్ఆర్టీసీ రికార్డ్​.. ఆ ఒక్కరోజులో ఆదాయం ఎంతంటే..!

author img

By

Published : Jan 19, 2023, 10:39 PM IST

Andhra Pradesh Road Transport Corporation

Andhra Pradesh Road Transport Corporation: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18న ఒక్కరోజే ఏపీఎస్ఆర్టీసీ రికార్డుస్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణ చార్జీతో బస్సులు నడిపితే... ప్రయాణికులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని వెల్లడించింది. సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కృషిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు. ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

APSRTC Record: ఈ నెల 18న ఏపీఎస్ఆర్టీసీ రికార్డుస్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఒక్కరోజే రూ.23 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రోజుగా రికార్డు సృష్టించింది. ఈసారి ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేయడం వల్లే ప్రయాణికులు ఆదరించినట్లు ఆర్టీసీ తెలిపింది. సాధారణ చార్జీతో బస్సులు నడిపితే... ప్రయాణికులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని వెల్లడించింది.

సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా సరాసరిన రోజుకు అధిక ఆదాయం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కార్గో సర్వీసు ద్వారా ఈ నెల 18న రూ.55 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్గోలో ఇప్పటివరకు ఒకరోజు ఆదాయం రూ.45 లక్షలు ఉండగా.. దాన్ని అధిగమించి రికార్డు నెలకొల్పినట్లు తెలిపారు. సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కృషిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు. ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరంతో పొల్చితే రూ.34 కోట్లు అధికంగా సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

సంక్రాంతి పండుగ ఎపీఎస్​ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తుండటం వల్ల, ఆర్టీసీ కి లాభాల పంట పండింది. రద్దీ దృష్ట్యా ఈ నెల 6 నుంచే పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో... ఈనెల 14 బోగి వరకే రికార్డు స్థాయిలో రాబడి ఆర్జించినట్లు ఎపీఎస్​ఆర్టీసీ వెల్లడించింది. కేవలం 9 రోజుల్లోనే 141 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు సంస్థ తెలిపింది. రోజుకు సరాసరి 15.66 కోట్లు చొప్పున రాబడి ఆర్జించినట్లు పేర్కొంది. ఈనెల 6 నుంచి 14 వరకు రోజూ తిరిగే బస్సులకు అదనంగా 3392 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై , బెంగళూరు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య బస్సులను తిప్పినట్లు పేర్కొన్నారు. కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే 7.90 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది సంక్రాంతి సీజన్ మొత్తం కలిపి రూ.107 కోట్ల ఆదాయం రాగా... ఈ ఏడాది సంక్రాంతి ముందు రోజుల్లోనే అంతకు మించి రూ.141 కోట్లు రాబట్టి, రూ.34 కోట్లు అదనపు ఆదాయాన్ని పొందినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 50 శాతం అదనపు చార్జీలువసూలు చేయగా.. ఈ సారి ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు వసూలు చేసి గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేయడం విశేషం. తిరుగు ప్రయాణానికి 10 శాతం రాయితీ ఇవ్వడంతో పాటుగా, ఐదుగురు కుటుంబ సభ్యులు టికెట్ బుకింగ్ చేస్తే 5 శాతం రాయితీ ఇచ్చి ప్రయాణికులను తనవైపు ఆకర్షించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.