ETV Bharat / state

పోలవరం నిర్మాణంలో వైసీపీకి నిబద్దత లేదు: గిడుగు రుద్రరాజు

author img

By

Published : Dec 13, 2022, 7:20 PM IST

Gidugu Rudraraju on Polavaram Project: పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా.. నిర్మాణంలో వైసీపీకి నిబద్దత లేదని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రుద్రరాజు పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ...25ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్న మాట నిల బెట్టుకోవాలన్నారు.

ప్రెస్
Congress

Congress Party Given National Status To Polavaram Project: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీకి నిబద్దత లేదని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో పాల్గొన్న రుద్రరాజు.. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ... పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. నాడు సీపీఎం తప్ప అందరూ రాష్ట్ర విభజన కోరారన్నారు. వైసీపీ తరపున మైసూరారెడ్డి కూడా ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని చెప్పారన్నారు. విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలిసిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. సజ్జల వంటి వాళ్లు కూడా అలా ఎందుకు మాట్లాడారో ఆయనే చెప్పాలన్నారు.

25ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. పోలవరం ‌హోదాపై సజ్జల మాట్లాడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో హోదాలు అనుభవించి.. పార్టీని వీడటం సరికాదన్నారు.పెద్దలంతా మంచి ఆలోచన చేసి, నిర్ణయం తీసుకోవాలన్నారు. 2024లో అధికారంలోకి రాకపోయినా.. కాంగ్రెస్ క్రియాశీలకంగా మారుతుందన్నారు. పొత్తులకు సంబంధించి మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.