కోర్టు మాటకు విలువ లేదా?..దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరుపై హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Mar 17, 2023, 8:50 AM IST

Etv Bharat

AP High Court Serious : విజయవాడ మధురా నగర్‌లోని అప్రోచ్‌ రోడ్డు, రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ జవ్వాజి నారాయణ ప్రసాద్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ విచారణకు గైర్హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు, విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP High Court Serious : విచారణకు గైర్హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు, విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ఇప్పటికే రెండు సార్లు కోర్టు ముందు హాజరయ్యారని ఆయన కన్నా డీఆర్‌ఏం గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. గత విచారణలోనూ డీఆర్‌ఎం హాజరు కావాల్సి ఉండగా ఆయన స్థానంలో ఓ ఇంజనీర్‌ను పంపించారని గుర్తు చేసింది. రేపు తాపీ మేస్త్రీని పంపేందుకు వెనుకాడరని మండిపడింది. డీఆర్‌ఎం స్థాయి అధికారి కోర్టుకు రప్పించలేకపోతే హైకోర్టు ఉండి ప్రయోజనం ఏముందని వ్యాఖ్యానించింది. ఇలాంటి అధికారుల నిర్లక్ష్య తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గుత్తేదారులు నష్టపోతున్నారని పేర్కొంది.

ఈ నెల 21కి విచారణ వాయిదా : ఒకానొక దశలో ఇరువురు అధికారులపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసేందుకు సిద్ధమైంది. వారెంట్‌ ఇవ్వొద్దని, హాజరు అయ్యేందుకు చివరి అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ పలుమార్లు అభ్యర్థించడంతో న్యాయమూర్తి శాంతించారు. విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ ఆ రోజు ఇరువురు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు : విజయవాడ మధురా నగర్‌లోని అప్రోచ్‌ రోడ్డు, రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ జవ్వాజి నారాయణ ప్రసాద్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గురువారం జరిగిన విచారణకు రైల్వే అధికారులతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ హైకోర్టుకు హాజరు కావాల్సి ఉంది. పిటిషనర్‌ నారాయణ ప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

న్యాయమూర్తి ఆగ్రహం : న్యాయస్థానం జోక్యంతో పనులు పునఃప్రారంభం సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి అయ్యాయని అన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ విచారణకు హాజరయ్యారు. గడువు పెంచాలని గుత్తేదారు చేసిన వినతిని ప్రభుత్వానికి పంపామన్నారు. రైల్వే అధికారుల తరఫున డీవైఎస్‌జీ హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో హాజరు కాలేకపోయానని అన్నారు. హాజరు నుంచి మినహాయింపు కోసం అనుబంధ పిటిషన్లు వేశామన్నారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహించారు. బీడబ్ల్యూ జారీకి సిద్ధమైతే డీవైఎస్‌జీ అభ్యర్థనతో వెనక్కి తగ్గారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.