ETV Bharat / state

ఆగని అంగన్వాడీల పోరు - ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మె విరమించేదేలే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 8:23 PM IST

Updated : Dec 19, 2023, 10:45 PM IST

Anganwadi Strike for Eight Day : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదో రోజు కొనసాగుతుంది. కనీస వేతనం, గ్రాట్యూటీ, ఫించన్ మినీ అంగన్వాడీలను మెయిన్‌గా గుర్తించాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తూ నామమాత్రపు చర్చలతో కాలయాపన చేస్తుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Anganwadi Strike
Anganwadi Strike

ఆగని అంగన్వాడీల పోరు - ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మె విరమించేదేలే

Anganwadi Strike for Eight Day : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఆందోళనలు అడ్డుకుంటే మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎనిమిదో రోజు అన్ని ప్రాంతాల్లో వంటా-వార్పుతో పాటు వినూత్నంగా నిరసనలు తెలిపారు. మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. పెరిగిన ధరలతో చాలీచాలని జీతాలతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అదేవిధంగా సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు దీక్ష చేశారు. అంగన్వాడీల నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

అంగన్వాడీల సమ్మెతో సచివాలయ సిబ్బందికి తిప్పలు - పిల్లలను బడులకు రప్పించలేక ఆపసోపాలు

Anganwadi Strikes in Konaseema District : కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మూడు మండలాలు చెందిన అంగన్వాడీలు, వర్కర్లు ఆందోళన చేశారు. ఎనిమిదో రోజు సమ్మెలో భాగంగా ఆటపాటలు, వంట వార్పుతో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం అంగన్వాడీలను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మెుండివైఖరి ప్రదర్శిస్తుందని వాపోయారు.

అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న

Demands of Anganwadis : సీఎం జగన్ అంగన్వాడీ, సహాయకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భిక్షాగాళ్లుగా మార్చారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు, హెల్పర్స్ బిక్షాటన చేపట్టారు. మార్కెట్​లో ప్రతి దుకాణం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో తమను బానిసలుగా వాడుకుంటూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె - మూతపడిన కేంద్రాలు

కనీస వేతనాలు పెంచాలనే డిమాండ్​ను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నరని తెలిపారు. అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షలకు పెంచాలని, ఆఖరి వేతనంతో 50 శాతం పింఛను ఇవ్వాలని, హెల్పర్స్ ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని తెలిపారు. తమ సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Anganwadi Strikes in Krishna District : కృష్ణా జిల్లా గన్నవరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వినూత్నంగా నిరసన చేశారు. వంటావార్పుతో పాటు వైసీపీ వ్యతిరేక పాలనపై జానపదపాటలు, డాన్సులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో అంగన్వాడీలు చెవులో పూలు, క్యాబేజీలను పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆగని అంగన్వాడీల పోరు - ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మె విరమించేదేలే

కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు

Last Updated : Dec 19, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.