ETV Bharat / state

కాపులకు రిజర్వేషన్లు.. కౌంటర్ దాఖలు చేయలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Mar 28, 2023, 5:24 PM IST

Andhra Pradesh High Court issued key orders: రాష్ట్రంలోని కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో న్యాయవాదుల వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని తెలియజేస్తూ..తదుపరి విచారణను వచ్చే నెల 26కి న్యాయస్థానం వాయిదా వేసింది.

g
HC on Kapu Reservations

Andhra Pradesh High Court issued key orders: కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు. కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇప్పుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడం లేదని న్యాయవాది రాధా కృష్ణ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను వచ్చే నెల 26కు న్యాయస్థానం వాయిదా వేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం 5శాతం రిజర్వేషన్‌‌ను కల్పిచాలంటూ.. ఫిబ్రవరి 6వ తేదీన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌లో రాష్ట్రంలోని కాపులు నేటికీ ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని, ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించేలా.. ఆదేశించాలు జారీ చేయాలంటూ ఆయన హైకోర్టునును కోరారు.

ఈ నేపథ్యంలో హరిరామజోగయ్య పిటిషన్‌పై ఫిబ్రవరి 21వ తేదీన విచారణ జరిపిన న్యాయస్థానం..జోగయ్య దాఖలు చేసిన వ్యాజ్యానికి ప్రజాహిత వ్యాజ్య(పిల్‌) స్వభావం ఉందని హైకోర్టు సింగిల్‌ జడ్జి అభిప్రాయపడిండి. ఆ ఫైల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుకు ఉత్తర్వులిచ్చింది.

ఈ క్రమంలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న హరిరామజోగయ్య పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ముందుగా కేంద్రం 10శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు.. పిటీషనర్ తరుపు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు .కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడం లేదని న్యాయవాది రాధా కృష్ణ కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలియజేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 26కి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.