ETV Bharat / state

జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు.. జులై వరకూ ఇదే పరిస్థితి..!

author img

By

Published : Feb 11, 2023, 10:43 AM IST

WATER LEVELS IN PROJECTS : రాష్ట్రంలోని పలు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలోని మధ్య తరహా, భారీ జలాశయాలన్నింటిలో ప్రస్తుతం 288.006 టీఎంసీల నిల్వ ఉండగా.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కలిపి ప్రస్తుతం 103 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.

WATER LEVELS IN PROJECTS
WATER LEVELS IN PROJECTS

WATER LEVELS REDUCED : వేసవి ప్రారంభానికి రాష్ట్రంలోని పలు జలాశయాల్లో ముందే నీటి నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఉన్న మధ్య తరహా, భారీ జలాశయాల్లో ప్రస్తుతం 288.006 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయాలన్నింటిలో కలిపి మొత్తం 441 టీఎంసీల నిటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కలిపి ప్రస్తుతం 103 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.

శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం వద్ద 2.540 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాగార్జునసాగర్‌ జలాశయంలో 101.191 టీఎంసీలు వినియోగానికి అనువుగా ఉన్నాయి. ప్రస్తుతం వేసవి ప్రారంభమవుతోంది. అనేక చోట్ల జలాశయాల్లో నీరు ఉన్నా వాటి పరిధి కొంత ప్రాంతానికే పరిమితం కావడం వల్ల ఒక స్థాయిని మించి తాగునీటి అవసరాలకు మళ్లించే వెసులుబాటు లేదు.

కొన్ని జలాశయాల్లో నీటిని నిల్వ చేసినా వాటికి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడం వల్ల తాగునీటిని దూర ప్రాంతాలకు అందించే అవకాశం లేకుండా ఉంది. రాబోయే 5 నెలల కాలానికి ఇవే నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. మళ్లీ జూన్‌లో రుతుపవనాలు వచ్చినా వర్షాలు ఊపందుకునే సరికి జులై వస్తుంది.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రాష్ట్ర జలాశయాల్లో ఉన్న నీళ్లు తక్కువేనని జలవనరులశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి ఉమ్మడి జలాశయాల్లో ఇంతకన్నా 30 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. అదే.. రాష్ట్రంలోని ఇతర జలాశయాల్లో 17 టీఎంసీలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.