ETV Bharat / state

హైకోర్టుకు హాజరైన రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్

author img

By

Published : Jan 30, 2023, 8:12 PM IST

Rayalaseema University
Rayalaseema University

Rayalaseema University: రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టులో హాజరయ్యారు. వర్శిటీ పూర్వ విద్యార్థులు యూనివర్శిటీలో కోర్సులో చేరేందుకు అడ్మిషన్ కోరగా.. రెండు పీజీల కంటే ఎక్కువ చదవకూడదని వర్శిటీ అధికారులు చెబుతూ అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో విద్యార్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా.. వాటిని అమలు చేయకపోవటంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

Rayalaseema University: రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ఆనందరావు, రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మలు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు హాజరయ్యారు. వర్శిటీ పూర్వ విద్యార్ధులు శ్రీరాములు, నాగరాజులు యూనివర్శిటీలో కోర్సులో చేసేందుకు అడ్మిషన్ కోరారు. రెండు పీజీల కంటే ఎక్కువ చదవ కూడదని పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నామని.. వర్శిటీ అధికారులు చెబుతూ అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

పిటీషన్​పై విచారించిన న్యాయస్థానం విద్యార్ధులకు అడ్మిషన్స్ ఇవ్వాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను వర్శిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ అమలు చేయక పోవటంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణకు హాజరైన వర్శిటీ వీసీ, రిజిస్ట్రార్​లు.. విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.